Oscars 2021 : అట్టహాసంగా ఆస్కార్ అవార్డు 2021 వేడుకలు..!

Oscars 2021  : అట్టహాసంగా ఆస్కార్ అవార్డు 2021 వేడుకలు..!
అత్యంత ప్రతిష్టాత్మక 93వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆస్కార్ 2021 అవార్డు విజేతగా నోమడ్‌లాండ్ చిత్రం నిలిచింది.

అత్యంత ప్రతిష్టాత్మక 93వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆస్కార్ 2021 అవార్డు విజేతగా నోమడ్‌లాండ్ చిత్రం నిలిచింది. ప్రముఖ మహిళా దర్శకురాలు క్లోవీచావ్ దర్శకత్వం వహించిన ఈ నోమడ్‌లాండ్ ఈసారి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటి.. ఇలా మూడు విభాగాల్లో ఆస్కార్ అవార్డు అందుకుంది.

కరోనా కారణంగా గతేడాది నుంచి ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ 93వ ఆస్కార్ వేడుకలు ఎట్టకేలకు ఆదివారం అర్థరాత్రి ప్రారంభమైంది. కన్నుల పండువగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవం తొలిసారిగా రెండు వేర్వురు ప్రాంతాల్లో నిర్వహించారు. డోల్బీ థియేటర్‌లోను.. లాస్ ఏంజెల్స్‌లో ఆస్కార్ అవార్డు విజేతలను ప్రకటించారు. ప్రేక్షకులు లేకుండా కేవలం సినీ సెలబ్రిటీలు మాత్రమే వేడుకలో పాల్గొన్నారు.

ఇక 93 ఆస్కార్ అవార్డుల్లో భాగంగా ఉత్తమ నటుడిగా ఆంథోని హాప్కిన్స్ ఎంపికయ్యారు. గ్యారీ ఓల్డ్ మన్, స్టీవెన్ యేన్, చాడ్విక్ బోస్‌మన్, రిజ్ అహ్మద్‌లతో పోటీ పడి ఈ అవార్డును కైవసం చేసుకున్నారు హాలీవుడ్ నటుడు ఆంథోని. ఉత్తమ చిత్రంగా నిలిచిన నోమడ్‌లాండ్‌లో నటనకు గాను ఫ్రాన్సెస్ మెక్ డోర్మాండ్‌ ఉత్తమ నటిగా ఎంపికైంది. ఉత్తమ సంగీతం విభాగంలో సౌండ్‌ ఆఫ్‌ మెటల్ అవార్డును దక్కించుకోగా.. జుడాస్‌ అండ్‌ ది బ్లాక్‌ మిస్సయా చిత్రంలో నటించిన డానియెల్‌ కలువకోయాకు ఉత్తమ సహాయ నటుడు అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ ప్లేగా ఎమరాల్డ్ ఫెన్నెల్.. ప్రామిసింగ్ యంగ్ ఉమెన్‌ చిత్రానికి గాను ఆస్కార్‌ దక్కింది..

మరోవైపు దివంగత బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్, క్యాస్టూమ్స్ డిజైనర్ భాను అథియాకు ఆస్కార్ అవార్డు వేదిక గౌరవించింది. 93వ అకాడమీ అవార్డుల జ్ఞాపకార్థం విభాగంలో ఇర్ఫాన్‌ ఖాన్‌, భాను అథియాలకు భారతీయ మొదటి ఆస్కార్ అవార్డు దక్కింది. బాఫ్టాల నివాళి విభాగంలో కనిపించిన రిషి కపూర్, ఆస్కార్ ఇన్ మెమోరయంలో చోటు దక్కలేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ పేరు కూడా ఆస్కార్ ఇన్ మెమోరయంలో లేకపోవడం ఆయన అభిమానులను నిరాశ పరిచింది.

Tags

Read MoreRead Less
Next Story