This Week OTT Releases : ఈ వారం ఓటిటి మూవీస్ అండ్ సిరీస్ లు ఇవే

ఓటిటి విస్తృతి పెరిగిన తర్వాత కామన్ పీపుల్ కూడా ఈ ప్లాట్ ఫామ్ పై ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఏ మూవీ / సిరీస్ ఎప్పుడు వస్తుంది. ఏ కంటెంట్ లో ఎంత పొటెన్సియల్ ఉంది అనే అంశాలు తెలుసుకుని మరీ ఆయా మూవీస్ ను చూసేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే వారం విడుదలవుతున్న కొన్ని ప్రముఖ ఓటిటి కంటెంట్స్ ఏంటీ ఏ భాషలో ఉన్నాయి.. ఏ తేదీన విడుదల కాబోతున్నాయో చూద్దాం.
ఆగస్ట్ 7 నుంచి ‘ ది జోన్ : సర్వైవల్ మిషన్’ అనే కొరియన్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతోంది.
ఆగస్ట్ 8 నుంచి ‘ఆర్ యూ ష్యూర్’ అనే కొరియన్ మూవీ డిస్నీ ప్లస్ లోనే స్ట్రీమ్ కాబోతోంది.
ఆగస్ట్ 8 నుంచి ‘ఏఏఏ’ అనే హిందీ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రాబోతోంది.
ఆగస్ట్ 9 నుంచి ‘లైఫ్ హిల్ గయీ’ అనే సినిమా డిస్నీ ప్లస్ లో స్ట్రీమ్ కాబోతోంది.
ఆగస్ట్ 9 నుంచి జీ 5లో ‘ గ్యారా గ్యారా’ అనే వెబ్ సిరీస్ స్ట్రీమ్ కానుంది.
ఆగస్ట్ 9 నుంచి సోనీ లివ్ లో ‘టర్బో ’ అనే మళయాలీ మూవీ స్ట్రీమ్ కానుంది.
నెక్ట్స్ ఫ్రైడే నెట్ ఫ్లిక్స్ లో చాలానే కంటెంట్ రాబోతోంది. లోకల్ నుంచి ఇంటర్నేషనల్ లెవల్ మూవీస్/సిరీస్ విడులవుతున్నాయి.
ఆగస్ట్ 8 నుంచి ‘ ది అంబ్రెల్లా అకాడెమీ’ అనే సిరీస్ ప్రసారం స్ట్రీమ్ అవుతుంది. ఇప్పటి వరకూ నాలుగు సీజన్స్ రాగా ఇది చివరిది.
ఆగస్ట్ 9 నుంచి వరుసగా
‘కింగ్స్ మేన్ గోల్డెన సర్కిల్’ (ఇంగ్లీష్ వెర్షన్)
‘భారతీయుడు -2 ’(తెలుగు, తమిళ్ వెర్షన్స్ )
‘ఫిర్ ఆయే హసీనా దిల్ రూబా’ (హిందీ)
‘మిషన్ క్రాస్ ’ (కొరియన్)
‘ఇన్ సైడ్ ది మైండ్ ఆఫ్ ది డాగ్ ’(ఇంగ్లీష్)
వంటి మూవీస్ / సిరీస్ లు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతున్నాయి.
ఆగస్ట్ 10న ‘ రొమాన్స్ ఇన్ ది హై స్ ’ ( కొరియన్) సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. సో.. ఈ శుక్రవారం ఓటిటి లవర్స్ కు పండగే పండగ అనుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com