Chiranjeevi : విశ్వంభరకు ఓటిటి షాక్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్ట్ చేస్తోన్న మూవీ విశ్వంభర. జనవరి 10న విడుదల కాబోతోన్న ఈ మూవీలో త్రిష, అషికా రంగనాథ్, సురభి ఫీమేల్ లీడ్స్ లో కనిపించబోతున్నారు. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విలన్. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ తో అడ్వెంచరస్ ఫాంటసీ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. వశిష్ట బింబిసార తర్వాత చేస్తోన్న మూవీ కావడంతో అతనిపై అభిమానుల్లో నమ్మకం ఉంది. బిజినెస్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుందీ మూవీ అని చాలామంది భావించారు. బట్ అలా ఏం జరగడం లేదు అని తెలుస్తోంది.
తాజాగా విశ్వంభర ఓటిటి రైట్స్ విషయంలో అందరూ షాక్ అయ్యే అమౌంట్స్ కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి మేకర్స్ దాదాపు 90 కోట్ల వరకూ ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్టు ఓటిటి సంస్థలకు చెబుతున్నారు. బట్ ఓ ప్రముఖ ఓటిటి సంస్థ కేవలం 35 కోట్లు అయితే ఓకే అని చెప్పిందట. అంటే మేకర్స్ ఊహించిన దాంట్లో సగం కూడా కాదు. వాళ్లు చెప్పిన అమౌంట్ విని మేకర్స్ షాక్ అయ్యారట. మరీ ఇంత దారుణంగా ఉందా ఓటిటి మార్కెట్ అని ఆశ్చర్యపోతున్నారట. కొన్నాళ్లుగా తెలుగు సినిమాల విషయంలో ఓటిటిల అంచనాలు తప్పుతున్నాయి. అందుకే భారీగా కోత విధిస్తున్నారు. ఈ క్రమంలో విశ్వంభర లాంటి భారీ సినిమాలు కూడా లాస్ అవుతున్నాయి. ఏదేమైనా ఈ మూవీ ఓటిటి రేట్ ఏ రేంజ్ లో ఫైనల్ అవుతుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com