Siddhu : సిద్ధు జాక్ సాంగ్ - ఏ ఉప్పెనలూ చూడక్కర్లా..

Siddhu :  సిద్ధు జాక్ సాంగ్ - ఏ ఉప్పెనలూ చూడక్కర్లా..
X

సిద్ధు జొన్నలగడ్డ మోస్ట్ ప్రామిసింగ్ హీరో అయిపోయాడు. డిజే టిల్లు, టిల్లు స్క్వేర్ మూవీస్ తో యూత్ కు ఫేవరెట్ హీరో అయ్యాడు. అందుకే అతని నెక్ట్స్ మూవీస్ పైనా ఆ క్రేజ్ కనిపిస్తోంది. ప్రస్తుతం అతను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో నటిస్తోన్న ‘జాక్’ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఆ మధ్య వచ్చిన టీజర్ తో చాలా ఆకట్టుకున్న ఈ టీమ్ ఈ పాటతోనూ మెప్పిస్తుందనే చెప్పాలి. హీరో క్యారెక్టరైజేషన్ గురించి తెలియజేస్తూ మరీ ఎక్కువ బిల్డప్ లు లేకుండా సింపుల్ గా కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత వనమాలి రాశాడీ పాటను. బెన్నీ దయాల్ పాడగా.. అచ్చు రాజమణి సంగీతం అందించాడు.

‘ఏ ఉప్పెనలూ చూడక్కర్లా.. తన ఉత్సాహం చూస్తే చాలదా.. ఏ అద్భుతమూ చూడక్కర్లా.. తన పోరాటం చూస్తే చాలదా.. ’ అంటూ మంచి లైన్స్ తో ఆరంభమైన పాటలో హీరో క్యారెక్టర్ గురించి చాలా బాగా నెరేట్ చేసేలా ఉంది సాహిత్యం. దీనికి పాబ్లో నెరూడా అనే హూక్ లైన్ కూడా బవుంది. అలాగే అదే లైన్ లో ఏ ఊహకు అందని నిజమితడా అనడం చూస్తే టీజర్ లో వచ్చిన అనుమానాలు నిజమే అనిపిస్తుంది. మంచ డ్యాన్స్ తో పాటు మాంటేజ్ గానూ కనిపిస్తోంది. చరణాల్లోని సాహిత్యం చూస్తే కాస్త అతిశయోక్తిగానే కనిపించినా.. ప్రస్తుతం సిద్ధు ఇమేజ్ కు సరిపోయేలా ఉంది.

మొత్తంగా మంచి ఇంప్రెషన్ వేసే పాటే ఇది. విశేషం ఏంటంటే.. కొన్నాళ్లుగా ఏ పాట చేసినా ఆర్టిస్టులు కాకుండా తనే కనిపిస్తున్నట్టుగా డ్యాన్స్ కంపోజ్ చేస్తూ వస్తోన్న జానీ మాస్టర్ ఈ సారి హీరోకు ఛాన్స్ ఇచ్చాడు. ఏ కొరియోగ్రాఫర్ అయినా తను కంపోజ్ చేసే స్టెప్ హీరోలను ఎలివేట్ చేయాలి. కానీ జానీ చేస్తే.. అతనే కనిపిస్తాడు. బట్ ఈ పాటలో సిద్ధు కనిపిస్తున్నాడు. అంటే మంచి కొరియోగ్రఫీ అనే కదా అర్థం.

ఇక సిద్ధు సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నరేష్ వికే కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల కాబోతోంది.

Tags

Next Story