Padayappa : పడయప్పా.. బాక్సాఫీస్ రూల్ చేస్తోందిగా

పడయప్పా (నరసింహా) మూవీ రీ రిలీజ్ తో అదరగొడుతోంది. ఇవాళ రజినీకాంత్ బర్త్ డే స్పెషల్ గా ఈ మూవీని మరోసారి విడుదల చేశారు. బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేస్తున్నారు అని తెలిశాక రజినీకాంత్ ఈ మూవీ కోసం ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ మూవీపై తనకు చాలా ప్రత్యేకమైన అభిమానం ఉందని చెప్పాడు. ఈ మూవీ విశేషాలు గురించి కూడా చాలానే చెప్పుకున్నాడు. ముఖ్యంగా రమ్యకృష్ణ పాత్ర, నటన గురించి చాలా మాట్లాడాడు. సౌందర్య పాత్రపై చెప్పాడు. దీంతో ఈ మూవీకి మంచి ప్రమోషన్స్ కూడా వచ్చాయి.కట్ చేస్తే మూవీకి రీ రిలీజ్ టైమ్ లో కూడా బ్లాక్ బస్టర్ గా తేలింది. ఈ మూవీకి ఓపెనింగ్ డే ఏకంగా 2 కోట్ల రూపాయలు కూడా వచ్చినట్టు చెబుతున్నారు.
రజినీకాంత్ ఈ సినిమాలో రెండు గెటప్పుల్లో కనిపించాడు. ఈ రెండు గెటప్స్ తో కూడా అదరగొట్టాడు. రమ్యకృష్ణ, సౌందర్య మధ్య వచ్చే సీన్స్ కు విజిల్స్ పడ్డాయి. రమ్యకృష్ణ పెళ్లి తర్వాత తను కనిపించడం మానేస్తుంది. చాలా యేళ్ల తర్వాత కనిపించిన పాత్ర సైతం అదరగొట్టింది. చివరికి తను సొంతంగా చనిపోవడం అనేది ఈ పాత్రలో తను అద్భుతంగా నటించింది. రజినీకాంత్ ఈ పాత్ర గురించి రమ్యకృష్ణ గురించి విపరీతంగా చెప్పుకున్నాడు కూడా. ఇక శివాజీ గణేశన్ క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాడు. 1999 ఏప్రిల్ 10న ఈ విడుదలైన మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేఎస్ రవికుమార్ డైరెక్షన్ లో నటించిన ఈ మూవీ రీ రిలీజ్ టైమ్ ఆయన కూడా చాలా మాట్లాడాడు. మొత్తంగా రీ రిలీజ్ తో కూడా భారీ ఓపెనింగ్స్ కూడా తెచ్చుకున్న మూవీ మరోసారి అదరగొడుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

