అవార్డు ఇచ్చేశారు.. మళ్లీ ఎందుకు: సోనూసూద్

అవార్డు ఇచ్చేశారు.. మళ్లీ ఎందుకు: సోనూసూద్
ప్రజల ప్రేమకు మించిన అవార్డులు ఏం ఉంటాయి. వారి హృదయాల్లో నాకు చోటు ఇచ్చారు. వారికి సేవ చేసే భాగ్యాన్ని దేవుడు నాకు కల్పిస్తున్నాడు.

ప్రజలకు సేవ చేయాలంటే నాయకులే కానక్కరలేదు. సాయం చేయాలన్న తలంపు ఉంటే సరిపోతుంది. నటన ద్వారా సంపాదించిన మొత్తాన్ని నలుగురి అవసరాలకు పంచేస్తున్నాడు. ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ కొండంత భరోసా ఇస్తున్నాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్. గత ఏడాది కరోనా మొదటి తరంగం అప్పుడు వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చి తన పేరుని చిరస్థాయిగా నిలుపుకున్నాడు. ఇప్పుడు సెకండ్ వేవ్‌లోనూ నేనున్నాను మీకు తోడుగా అంటూ అడిగిన వారికి లేదనకుండా సహాయపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌తో పాటు అనేక రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేస్తున్న సాయానికి స్పందనగా నటుడు బ్రహ్మాజీ సోనూకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించాలని అని ట్వీట్ చేశారు. దానికి సోనూ రిప్లై ఇస్తూ.. అవార్డు ఎందుకు బ్రదర్.. ఇప్పటికే 135 కోట్ల మంది భారతీయులు నన్ను తమ హృదయంలో పెట్టుకున్నారు. అది చాలు నాకు. అంతకంటే పెద్ద అవార్డులు ఏముంటాయి అని అన్నారు. సోనూ సూద్ ఇచ్చిన జవాబుకి నెటిజన్లు శభాష్ సోనూసూద్ అని పోస్టులు పెడుతున్నారు.

Tags

Next Story