Gangubai Kathiawadi : అలియా కోసం ఏకంగా థియేటర్ మొత్తాన్ని బుక్ చేసుకున్న ఫ్యాన్..!

Gangubai Kathiawadi : బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో బ్యూటీ అలియా భట్ మెయిన్ లీడ్ లో వచ్చిన మూవీ ' గంగూబాయి కతియావాడి ' ఫిబ్రవరి 25వ తేదీన విడుదలైన ఈ సినిమా ఘనవిజయాన్ని సాధించింది. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రల్లో కనిపించిన అలియా ఈ సినిమాలో తన వైవిధ్యమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది.
ఈ సినిమాలో ఆమె మాఫియా క్వీన్‌గా, వేశ్యగా రెండు విభిన్నమైన పాత్రల్లో నటించింది. ఆమె నటనకి విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. కమాతిపురలోని రెడ్‌లైట్ ఏరియాలో గంగూబాయి అనే ఓ యువతి మాఫియా క్వీన్‌గా ఎలా మారిందనేదే ఈ చిత్రం కథ. అయితే ఆలియా నటించిన సినిమా చూసేందుకు ఓ అభిమాని ఏకంగా థియేటర్ బుక్ చేసుకున్నాడు.
పాకిస్థాన్‌కి చెందిన ఓ మోడల్, నటుడు మునీబ్ భట్ అలియా భట్‌కి వీరాభిమాని. దీంతో తన భార్యతో కలిసి 'గంగూబాయి కతియావాడి' సినిమా చూసేందుకు థియేటర్ మొత్తం బుక్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో అలియాభట్ ఫ్యాన్స్ పేజీల్లో వైరల్ అవుతోంది.
ఇదిలావుండగా అలియాభట్ టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం నిన్న (మార్చి 25)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఇందులో ఆమె సీత పాత్రలో నటించి మెస్మరైజ్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com