సినిమా

Shoaib Akhtar : షోయబ్ అక్తర్ బయోపిక్.. అప్పుడే రిలీజ్..

Shoaib Akhtar : 'రావల్పిడి ఎక్స్‌ప్రెస్' షోయభ్ అక్తర్ జీవితం వెండితెరకెక్కనున్నది.

Shoaib Akhtar : షోయబ్ అక్తర్ బయోపిక్.. అప్పుడే రిలీజ్..
X

Shoaib Akhtar : 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్' షోయభ్ అక్తర్ జీవితం వెండితెరకెక్కనున్నది. తనదైన వేగం, రయ్యిమని దూసుకొచ్చే యార్కర్లు, ఒంటికి తాకే బౌన్సర్లతో గత తరం బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించిన ఈ దిగ్గజ పేసర్.. తన బయోపిక్‌ను ప్రకటించాడు. తన ప్రయాణాన్ని వెండితెరపై చూపించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. తాజాగా అక్తర్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.

అభిమానులు తనను ఇష్టంగా పిలచుకునే 'రావల్పిడి ఎక్స్‌ప్రెస్ పేరునే తన సినిమాకు టైటిల్‌గా వాడుకుంటున్నాడు. ఈ బయోపిక్‌కు మహ్మద్ ఫరాజ్ ఖైజర్ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం కథా చర్చల్లో ఉన్న ఈ సినిమాను 2023 నవంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు అక్తర్ ఈ మోషన్ పోస్టర్‌లో వెల్లడించాడు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES