Akhanda 2 : అఖండ 2 ఓటిటిలోకి వస్తుందా..?

Akhanda 2  :  అఖండ 2 ఓటిటిలోకి వస్తుందా..?
X

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన మూవీ అఖండ2. ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అదే టైమ్ లో కొంతమంది కావాలని నెగెటివ్ చేశారని చెప్పారు. ఆ మేరకు భారీ వసూళ్లు రావాల్సిన సినిమా కాస్త ఆ మొత్తంగా ఆగిపోయింది అన్నారు. అఖండకు సీక్వెల్ గా వచ్చిన అఖండ 2 సనాతన ధర్మాన్ని తిరుగులేని ప్రమోట్ చేసిన సినిమాగా కనిపించింది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లు ఆకట్టుకున్నాయి. రెండు పాత్రల్లోనే బాలయ్య కనిపించినా.. ఈ సారి అఘోరాకు హైలెట్ అయ్యాడు. అదే టైమ్ లో అఘోరాకు మరిన్ని గొప్ప శక్తులు కూడా లభించాయి అనేలా చూపించారు.

బాలకృష్ణ నట విశ్వరూపం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది అఖండ 2 లో. రెండు పాత్రల్లోనూ అద్భుతమైన నటన చూపించాడు. సంయుక్త పాత్ర ఆకట్టుకుంది. ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా పాత్రలు హైలెట్ అయ్యాయి. అదే టైమ్ లో మహాశివుడు కనిపించిన సన్నివేశాలు మాత్రం నభూతో అన్నట్టుగా కనిపించాయి. అలాంటి మూవీ ఓటిటిలో వస్తోంది. డిసెంబర్ 12న విడుదలైన ఈ చిత్రాన్ని 2026 జనవరి 9న ఓటిటిలో విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది. మరి ఓటిటిలో కూడా ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Tags

Next Story