వైష్ణవ్‌ తేజ్‌ మూవీ టైటిట్ ఫిక్స్.. ఇంట్రో అదుర్స్

Vaisshnav Tej

Vaisshnav Tej

Vaisshnav Tej: మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌(Vaisshnav Tej) హీరోగా చేసిన తొలి చిత్రం ఉప్పెన.

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌(Vaisshnav Tej) హీరోగా చేసిన తొలి చిత్రం ఉప్పెన. ఈ సినిమా ఊహించిన దాని కంటే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా విజయంతో వైష్ణవ్ తేజ్ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన తన ద్వితీయ చిత్రం టైటిల్‌ని చిత్రబృందం ఖరారు చేసింది. వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకి 'కొండపొలం' అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం మోషన్‌ పోస్టర్‌, ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేసింది.

విభిన్నమైన కథాంశంతో ఈ 'కొండపొలం' (#KONDAPOLAM)తెరకెక్కుతుంది. అక్టోబర్‌ 8న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితం, వారి కష్ట సుఖాలు తెలియజేస్తూ గతంలో వచ్చిన ఓ నవలను ఆధారంగా చేసుకుని ఈ కథ తెరకెక్కిస్తున్నట్లు క్రిష్‌ ఓ సందర్భంలో చెప్పారు. వైష్ణవ్ ‌తేజ్‌కు జంటగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నటిస్తుంది. ఇందులో రకుల్‌ ఓబులమ్మ అనే గ్రామీణ యువతి పాత్రలో కనిపించనున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ చాలా వరకూ పూర్తయ్యింది. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‎పై రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.Tags

Read MoreRead Less
Next Story