Pankaj Tripathi : పాఠశాల లైబ్రరీని తండ్రికి అంకితం చేసిన పంకజ్ త్రిపాఠి

Pankaj Tripathi : పాఠశాల లైబ్రరీని తండ్రికి అంకితం చేసిన పంకజ్ త్రిపాఠి
సమాజం పట్ల తన నిబద్దతను చాటుకున్న పంకజ్ త్రిపాఠి

ప్రఖ్యాత నటుడు పంకజ్ త్రిపాఠి గోపాల్‌గంజ్‌లోని బెల్సాండ్‌లోని హయ్యర్ సెకండరీ స్కూల్‌లో సరికొత్త లైబ్రరీని ప్రారంభించాడు. విద్యనందించడం, సమాజ అభివృద్ధికి ఏదైనా చేయాలనే తన నిబద్ధతను మరోసారి చాటుకున్నాడు. దీన్ని ఆయన తన దివంగత తండ్రి పండిట్ బనారస్ తివారీకి జ్ఞాపకార్థంగా నిర్మించామని, అందుకే ఆయనకే అంకితం చేస్తున్నామని చెప్పారు.

బీహార్‌లోని గోపాల్‌గంజ్‌కు చెందిన పంకజ్ త్రిపాఠి గతంలో తాను చదువుకున్న పాఠశాలకు పునర్వైభవం కల్పించాలనే లక్ష్యంతో ఈ పనికి పూనుకున్నారు. తన అన్నయ్యతో పాటు, వారి తల్లిదండ్రుల గౌరవార్థం స్థాపించబడిన పండిట్ బనారస్ తివారీ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఈ ప్రయత్నాన్ని చేపట్టారు. ఇందులో ఎలక్ట్రికల్ పరికరాలు, ప్రాంగణం ఉన్నాయి. సుస్థిర అభివృద్ధికి నిలయమైన ఈ పాఠశాలలో పర్యావరణ అనుకూల సౌరశక్తి ప్యానెల్‌లను ఏర్పాటు చేశారు.

సాహిత్యం, పుస్తకాలపై పంకజ్ త్రిపాఠి ప్రగాఢమైన ప్రేమ పాఠశాల ఆవరణలో పూర్తి సౌకర్యాలతో కూడిన లైబ్రరీని నిర్మించడానికి ప్రేరేపించింది. ఈ లైబ్రరీ ఇప్పుడు విజ్ఞాన దీవిగా నిలుస్తోంది. రాబోయే సంవత్సరాల్లో విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు సిద్ధంగా ఉంది. తన తండ్రి జ్ఞాపకార్థం, పంకజ్.. పాఠశాల విద్యార్థులకు శాశ్వత బహుమతిని అందించాడు, నేర్చుకోవడం పట్ల ప్రేమను పెంపొందించాడు. "ఈ లైబ్రరీని మా తండ్రి పండిట్ బనారస్ తివారీ జ్ఞాపకార్థం అంకితం చేయడం ద్వారా, గోపాల్‌గంజ్‌లోని బెల్సాండ్‌లోని విద్యార్థుల హృదయాలలో జ్ఞానం, సాహిత్యంపై జీవితకాల ప్రేమను నింపాలని ఆశిస్తున్నాను. విద్య అనేది మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి. దాన్ని భవిష్యత్ తరాలకు అందించండి" అని ఆయన అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story