Bhavadeeyudu Bhagat Singh : పవన్, హరీష్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్..!

Bhavadeeyudu Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ డైరెక్షన్‌లో భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పవన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది.
అయితే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ మూవీలో విలన్‌గా మిర్జాపూర్ ఫేమ్ పంకజ్ త్రిపాఠిని తీసుకున్నారట. హరీష్ ఇప్పటికే అతనిని కలిసి కథని వినిపించారట.. చేసేందుకు పంకజ్ త్రిపాఠి కూడా ఓకే చెప్పినట్టుగా సమాచారం. దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే వెలువడనుంది.
కాగా ఇందులో పవన్ కళ్యాణ్ తెలుగు లెక్చరర్‌గా, పూజా హెగ్డే ఇంగ్లీష్ లెక్చరర్‌గా కనిపించనున్నారట. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో మొదలుకానుందట.. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ తరువాత పవన్, హరీష్ కాంబోలో సినిమా వస్తుండడంతో భవదీయుడు భగత్ సింగ్ మూవీ పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com