Anupama Parameswaran : అనుపమ 'పరదా'వెనక కథేంటీ.?

Anupama Parameswaran :  అనుపమ పరదావెనక కథేంటీ.?
X

అనుపమ పరమేశ్వరన్, దర్శన, సంగీత ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న సినిమా 'పరదా'.గతంలో ఈ టైటిల్ తో అనుపమ మూవీ అంటూ అనౌన్స్ అయినప్పుడు కూడా అంతా ఆసక్తిగానే చూశారు. సినిమా బండి మూవీతో ఆకట్టుకున్న పవన్ కండ్రేగుల రూపొందిస్తోన్న ఈ మూవీ టీజర్ విడుదలైంది. టీజర్ చూడగానే ఇంప్రెసివ్ అనిపిస్తుంది. ఓ కొత్త పాయింట్ తో రూపొందుతోన్న మూవీలా కనిపిస్తోంది. టీజర్ ఆరంభంలోనే .. 'ఛా.. పిచ్చి గిచ్చి పట్టిందా ఆ అమ్మాయికి అక్కడెక్కడో చావడానికి 70లక్షలు ఇస్తుందంట' అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. అక్కడెక్కడో అనే ఆ ప్లేస్ ఏంటీ అనేది సినిమాలో ఇంట్రెస్టింగ్ గా కనిపించే పాయింట్ లా ఉంది.టీజర్ అంతా అనుపమ పరదా కప్పుకునే ఉండటం.. చివర్లో ఒకానొక ప్లేస్ లో పరదా తీసేయడం చూస్తుంటే ఇదేదో ఒకానొక ప్రాంతంలో అమ్మాయిలపై సాగించే వివక్ష లేదా సంప్రదాయాల మాటున ఆడవారిని అణచివేయడం అనే కోణంలో కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ముగ్గురూ కలిసి ఓ పెద్ద ప్రయాణం సాగించడం ఆ ప్రయాణంలో ఒకరినొకరు తెలుసుకోవడం.. మధ్యలో అనుపమ మిస్ కావడం.. ఆమె లక్ష్యం తెలిసిన మిగతా ఇద్దరూ తను అది సాధించాలని కోరుకోవడం వంటివి టీజర లో కనిపిస్తున్నాయి. ఎలా చూసినా విమెన్ సెంట్రిక్ మూవీస్ అంటే హీరోయిన్ ఏదైనా చేయగలదు అనే కాన్సెప్ట్ లో కనిపిస్తోన్న టైమ్ లో కాన్సెప్ట్ బేస్డ్ గా ఉన్న ఈ మూవీ కథాబలంతో రూపొందినట్టుగా ఈ టీజర్ చూస్తే అర్థం అవుతోంది. మరి మూవీ ఎలా ఉంటుందోకానీ టీజర్ మాత్రం వెరీ ఇంప్రెసివ్ గా ఉందనే చెప్పాలి.

Tags

Next Story