Wedding Photos : వైరల్ అవుతోన్న పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా పెళ్లి ఫొటోలు

Wedding Photos : వైరల్ అవుతోన్న పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా పెళ్లి ఫొటోలు
X
బయటికొచ్చిన పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా పెళ్లి ఫొటోలు

ఎంతో మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న క్షణం ఎట్టకేలకు ముగిసింది. నూతన వధూవరులు పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా ఫైనల్ గా తమ అధికారిక వివాహ ఫోటోలను రిలీజ్ చేశారు. దీంతో ఇంటర్నెట్ లో ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. సెప్టెంబర్ 24న పెళ్లి పీటలు ఎక్కిన ఈ జంట తమ పెళ్లి ఫోటోలలో 'మ్యాచ్ మేడ్ ఇన్ హివెన్' లుక్‌తో అందంగా కనిపించారు.

వెడ్డింగ్ డే కోసం, పరిణీతి చోప్రా సాంప్రదాయ ఎరుపు రంగుల్లో, మనీష్ మల్హోత్రా రూపొందించిన మినిమల్ టోన్-డౌన్ కాంటెంపరరీ లెహంగాలో కనిపించింది. ముఖ్యంగా, వధువు ఐవరీ, లేత గోధుమరంగు రంగులలో డ్రై మోడర్న్ దుస్తుల్లో మైమరపించింది. ఇక రాఘవ్ చద్ధా మినిమలిస్ట్ వెడ్డింగ్ లుక్ లో అదరగొట్టాడు. ఉంగరాల జుట్టుతో తన రూపాన్ని పూర్తిగా మార్చేశాడు. రాఘవ్ చద్దా తెల్లటి షేర్వాణీని ధరించి అద్భుతంగా కనిపించాడు.

తాజాగా ఈ ఫొటోలను షేర్ చేసిన ఈ జంట.. "అల్పాహారం టేబుల్ వద్ద మొదటి చాట్ నుండి, మా హృదయాలకు తెలుసు. చాలా కాలంగా ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాము. చివరకు మిస్టర్ అండ్ మిసెస్ కావడం చాలా ఆశీర్వాదం! ఒకరినొకరు లేకుండా జీవించలేము" అంటూ క్యాప్షన్ లో రాసుకువచ్చారు.

రాజస్థాన్‌ ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహం చేసుకున్నారు. ఈ వేడుకలు తాజ్ ప్యాలెస్, లేక్ పిచోలా, లీలా ప్యాలెస్ రెండింటిలోనూ జరిగాయి. చద్ధా ఆదివారం పడవలో బరాతీస్ కోసం బయలుదేరాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. పెళ్లికూతురు అత్త మధు చోప్రా పెళ్లికి హాజరు కాగా, కోడలు ప్రియాంక చోప్రా , బావ నిక్ జోనాస్ పెళ్లికి దూరమయ్యారు. ఇక గతంలో బాలీవుడ్ జంటలు కత్రినా కైఫ్ -విక్కీ కౌశల్, సిద్ధార్థ్ మల్హోత్రా -కియారా అద్వానీ సైతం రాజస్థాన్‌లో వివాహం చేసుకున్నారు.


Tags

Next Story