రాఘవ్ చద్దాతో నిశ్చితార్థం.. పరిణీతి ఓ అందమైన నోట్‌..

రాఘవ్ చద్దాతో నిశ్చితార్థం.. పరిణీతి ఓ అందమైన నోట్‌..
ప్రేమ పక్షులు పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా మే 13న ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో తమ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు.

ప్రేమ పక్షులు పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా మే 13న ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో తమ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. అనంతరం పరిణీతి ఓ అందమైన నోట్‌ రాసింది. తమపై ప్రేమను, ఆశీర్వాదాలను కురిపించిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

“గత కొన్ని వారాలుగా, ముఖ్యంగా మా నిశ్చితార్థం సందర్భంగా మేము పొందిన ప్రేమ అపారం. మేమిద్దరం వేర్వేరు ఇతి వృత్తాల నుండి వచ్చాము. మా ప్రేమను ఇరు కుటుంబాల వారు అంగీకరించారు. దాంతో మేము ఊహించనంత పెద్ద కుటుంబాన్ని పొందాము.

మీరందరూ మాతో ఉన్నారని తెలుసుకుని మేము ఈ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నాము. ” పరిణితీ చోప్రా తల్లి రీనా చోప్రా కూతురు నిశ్చితార్థం ఫోటోను పంచుకుంటూ.. “మీ జీవితంలో దేవుడు ఉన్నాడని మళ్లీ మళ్లీ విశ్వసించేందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఇది వాటిలో ఒకటి " పరిణితి 'నిజంగా ఆశీర్వదించబడింది', 'దేవునికి ధన్యవాదాలు' అని హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

న్యూఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా నిశ్చితార్థం జరిగింది. ఈ జంట అదే రోజు వేడుకకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. రాఘవ్ చద్దా తన ఇన్ స్టాలోకి వెళ్లి, "నేను ఏదైతే కోరుకున్నానో అది జరిగింది అని రాశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో వీరి పెళ్లి జరగనుందని సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story