Mr. Celebrity : హీరోగా పరుచూరి వారి మనవడు

Mr. Celebrity : హీరోగా పరుచూరి వారి మనవడు

టాలీవుడ్ ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్‌ పరుచూరి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం మిస్టర్‌ సెలెబ్రిటీ. కొత్త దర్శకుడు రవి కిశోర్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఆర్పీ సినిమాస్ బ్యానర్‌పై ఎన్ పాండురంగారావు, చిన్నా రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. సెలబ్రిటీ అవ్వాలనుకున్న ఒక యువకుడు ఎం చేశాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు. థ్రిలర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమాకు విడుదల తరువాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Tags

Next Story