Paruchuri Gopala Krishna: 'ఆయనంటే మాస్టర్ ఆఫ్ స్క్రీన్‌ప్లే'... అన్నయ్య ఆరోగ్యం పై గోపాలకృష్ణ...!

Paruchuri Gopala Krishna : పరుచూరి బ్రదర్స్ అంటే కేవలం పేరు మాత్రమే కాదు.. ఓ బ్రాండ్ కూడా... ఎన్నో సినిమాలకి కథ, కథనం మాటలు అందించి చాలా మంది హీరోలను స్టార్ లని చేసిన రైటర్స్ వారు.. ఇందులో పెద్దవారైన పరుచూరి వెంకటేశ్వరరావు (80) ఆరోగ్యం గురించి గత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ న్యూస్ హల్‌చల్ చేసింది.
ప్రస్తుతం వెండితెరకి దూరంగా ఉంటున్న వెంకటేశ్వరరావుని ఆ మధ్య దర్శకుడు జయంత్ సి పరాన్జీ వెళ్లి కలిశారు.. అయనతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెంకటేశ్వరరావుకు ఏమైంది అన్న సందేహాలు అభిమానుల్లో కలిగాయి. ఈ క్రమంలో తన అన్నయ్య ఆరోగ్యం గురించి వస్తోన్న వదంతులపై పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం గానే ఉన్నారని వెల్లడించారు. 2017లో ఆస్ట్రేలియా వెళ్లి వచ్చిన తర్వాత ఆయనకు స్వల్ప ఆరోగ్య సమస్యలున్నట్లు గుర్తించామని ప్రస్తుతం దానికి అనుగుణంగా ఆహార నియమాలు పాటిస్తున్నారని అన్నారు. ఆయన ప్రస్తుతం పది కిలోలు తగ్గారు కాబట్టి అలా కనిపిస్తున్నారని తెలిపారు.
పరుచూరి వెంకటేశ్వరరావు అంటే మాస్టర్ ఆఫ్ స్క్రీన్‌ప్లే. పల్స్ ఆఫ్ ది ఆడియన్స్ తెలిసిన వ్యక్తి అని కొనియాడారు. వయసు పెరిగే కొద్ది శరీరంలో మార్పులు రావడం సహజమేనని అన్నారు. అయితే ఇప్పటికి ఫోన్ చేసినప్పటికీ అయన స్పష్టంగా మాట్లాడుతున్నారని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com