'గుండమ్మ కథ' మళ్ళీ చేయాలనీ అనుకున్నాం.. కానీ బాలయ్య అలా అనేసరికి..!

'పరుచూరి పలుకులు' పేరుతో యూట్యూబ్‌లో తన అనుభవాలను పంచుకుంటూ ఉంటారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. అందులో భాగంగానే తాజాగా అలనాటి దిగ్గజ సినీ రచయిత డి.వి. నరసరాజు గురించి పలు విషయాలను పంచుకున్నారయన.. రచయితల కంటూ ఓ సంఘం ఉండాలని పట్టుబట్టి మరి మద్రాస్ లో తెలుగు సినీ రచయితల సంఘాన్ని పెట్టించారని అన్నారు. అందరు రచయితలు కథలను ఆఫీసుల్లో కంటే గెస్టు హౌసుల్లో కూర్చొని రాసేవారని, కానీ ఆయన మాత్రం ఏనాడూ, ఏ హోటల్ కూడా రూమ్ బుక్ చేసుకొని కథలను రాయలేదని చెప్పుకొచ్చారు. తెలుగు సినిమా రచయితల సంఘానికి ఆయనో భీష్మాచార్యుడని పరుచూరి అన్నారు.
ఇక డి.వి. నరసరాజు సంబాషణలు అందించిన 'గుండమ్మ కథ' సినిమా గురించి పరిచూరి మాట్లాడుతూ.. " ముందుగా ఈ సినిమాని విడుదల చేయడానికి విజయా ప్రొడక్షన్స్ వారు భయపడ్డారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నిక్కర్‌తో కనిపించడమే దానికి కారణం. అలాగే సినిమాని విడుదల చేస్తే ప్రజలు కొడతారేమని వారి భయం. అయితే, విజయావారి ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగినప్పుడు వారి ఇంటికి వచ్చిన బంధువులు ఈ సినిమాని చూసి పడీపడీ నవ్వారు. దీనితో విజయా వారికి చాలా దైర్యం వచ్చింది. అప్పుడు సినిమాను రిలీజ్ చేశారు. ఆ తర్వాత సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికి టీవీలో వచ్చిన ఈ సినిమాని చూస్తారు. అయితే ఈ సినిమాని బాలకృష్ణ, నాగార్జునతో చేద్దామని అనుకున్నాం. ఇదే విషయాన్ని బాలయ్యతో మాట్లాడితే 'మళ్లీ మాతో తీస్తే చూస్తారా?' దీనితో ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని అన్నారు.
ఇక డి.వి. నరసరాజు విషయానికి వచ్చేసరికి 1954లో పెద్దమనుషులు సినిమాతో రచయితగా సినీరంగప్రవేశం చేశారు. ఆ తర్వాత యమగోల, భక్తప్రహ్లాద, రాముడు భీముడు, దొంగరాముడు మొదలగు సినిమాలకి కథ-మాటలు అందించారు. 2006 ఆగష్టు 28న హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో అనారోగ్య సమస్యలతో మరణించారు. ఈయన మనవరాలే హీరో సుమన్ భార్య కావడం విశేషం.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com