Paruchuri Gopala Krishna : ఆ రోజు చిరంజీవి, బాలకృష్ణ నా మాట వినక దెబ్బతిన్నారు : పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopala Krishna : హీరో బాడీ లాంగ్వేజ్ తగ్గుట్టుగానే కథలు, సంభాషణలు ఉండాలని, అప్పుడే ప్రేక్షకులకి అవి నచ్చుతాయని అన్నారు సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.. 'పరుచూరి పాఠాలు' అనే పేరుతో అనేక అంశాల పైన మాట్లాడే ఆయన.. తాజాగా హీరోల బాడీ లాంగ్వేజ్ పైన మాట్లాడారు.
గతంలో చిరంజీవి నటించిన 'శంకర్‌దాదా జిందాబాద్' సినిమా చిరు బాడీ లాంగ్వేజ్‌కు సరిపోదని చెప్పానన్నారు.. ఈ విషయాన్ని ఆయనకి చెబితే.. 'మీరు కాస్త రెబల్ కాబట్టి, మీకు పెద్దగా నచ్చదులేండి' అంటూ నవ్వేసి ఊరుకున్నారు గోపాలకృష్ణ ఈ సందర్భంగా వెల్లడించారు. చిరంజీవి ఒక మహావృక్షమని ఆయన శాంతి ప్రవచనాలు చెబితే ప్రేక్షకులకి రుచించదని అన్నారు.
అలాగే గతంలో హీరో బాలకృష్ణ విషయంలో కూడా ఇదే జరిగిందని అన్నారు. అల్లరి పిడుగు సినిమా చేస్తున్న సమయంలో అందులో తండ్రి పాత్ర కూడా ఆయననే వేయమని రిక్వెస్ట్ చేశానని అన్నారు. 'తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని, ముంబయి నుంచి వచ్చిన ఓ కొత్త నటుడిని చూసి బాలకృష్ణ భయపడుతుంటే జనానికి నచ్చదు. తండ్రి పాత్ర కూడా మీరే వేయండి బాబూ ' అని బాలయ్యకి చెప్పానని, కానీ దర్శకనిర్మాతలు ఒప్పుకోలేదని అన్నారు. దీనితో దెబ్బతిన్నారని గుర్తు చేశారు.
ఇక 'పెద్దన్నయ్య' సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తే, చూశారని, అందరికీ నచ్చిందని ఈ సందర్భంగా వెల్లడించారు గోపాలకృష్ణ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com