Parvati Nair: 'అర్జున్ రెడ్డి' ఆఫర్‌ని వదులుకున్నందుకు బాధపడుతున్నా: ప్రముఖ నటి

Parvati Nair: టైమ్ బావుండక పోతే అలానే జరుగుతుంది.. అదృష్టం తలుపుతడుతుంది.. అవకాశం గుమ్మంలోకి వస్తుంది.. ఏవో కారణాలతో ఒక్కోసారి రిజెక్ట్ చేయాల్సి వస్తుంది.. ఇది సినిమా నటీ నటుల విషయంలో ఎక్కువగా జరుగుతుంటుంది.. ఆ పాత్రకు ఒకరిని అనుకుని మరొకరితో తీస్తారు.. అవి హిట్టైతే వదులుకున్న వారి పాపం గుర్తొచ్చినప్పుడల్లా బాధపడుతుంటారు.. ఇప్పుడు అదే పరిస్థితి ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన నటిది. అర్జున్ రెడ్డి వచ్చి అయిదేళ్లైనా ఇంకా మర్చిపోలేకపోతోంది..
ప్రముఖ తమిళ నటి పార్వతి నాయర్ బ్లాక్ బస్టర్ చిత్రం అర్జున్ రెడ్డిని తిరస్కరించినందుకు విచారం వ్యక్తం చేసింది. సినిమాలో తీవ్రమైన ఇంటిమేట్ సన్నివేశాల కారణంగా ఆమె ఆఫర్‌ను తిరస్కరించింది.
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ చాట్ సెషన్‌లో, ఒక అభిమాని ఆమెను ఆ చిత్రానికి సంతకం చేయనందుకు చింతిస్తున్నారా అని అడిగాడు. దాంతో ఆమె "అవును, అది నిజం. ఇది నేను మిస్ చేయకూడని అందమైన చిత్రం. కానీ అది మనకు రాసిపెట్టి ఉంటే కచ్చితంగా మనకే వస్తుంది అనే సిద్ధాంతాన్ని నేను బలంగా నమ్ముతాను. కాబట్టి నేను కావాలనుకునే మరిన్ని అందమైన సినిమాలు నా ముందుకు వస్తాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని చెప్పింది.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ, షాలిని పాండే ప్రధాన పాత్రలలో నటించారు. ఇది సందీప్, విజయ్ కెరీర్‌లో ది బెస్ట్‌గా నిలిచింది. ఇక ఈ చిత్రం హిందీలో కబీర్ సింగ్‌గా, తమిళంలో ఆదిత్య వర్మగా కూడా రీమేక్ చేయబడింది. ఉత్తమ విలన్, యెన్నై అరిందాల్ వంటి చిత్రాలతో పార్వతి నాయర్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com