Pathaan Movie : షారూఖ్ ఖాన్ అర్ధరాత్రి ఫోన్ చేశారు : అస్సాం సీఎం
బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ అర్థరాత్రి ఫోన్ చేసినట్లు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. షారూఖ్ నటించిన 'పఠాన్' మూవీని గౌహతీలో కొందరు అడ్డకుంటున్నారని తగిన చర్యలు తీసుకోవలసిందిగా షారూఖ్ కోరారని చెప్పారు. శాంతి భద్రతలను కాపాడటం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని, ఘనపై విచారించి, అవాంచనీయ సంఘటనలు జరుగకుండా చూస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇందుకుగాను ట్వీట్ చేశారు.
జనవరి 25వ తారీఖున 'పఠాన్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. శుక్రవారం సాయంత్రం అస్సాంలో 'పఠాన్' రిలీజ్ అయ్యే థియేటర్ వద్ద కొందరు పోస్టర్లను చించేసి థియేటర్ పై దాడి చేశారు. ఈ ఘటనపై స్థానిక మీడియా, సీఎం హిమంత శర్మను ప్రశ్నించగా.. తనకు షారూఖ్ తెలియదని.. అయినా రాష్ట్ర ప్రజలు అస్సామీ చిత్రాల గురించి ఆలోచించాలని హాందీ చిత్రాల గురించి కాదని చెప్పారు. బాలీవుడ్ నుంచి చాలామంది తనకు ఫోన్ చేస్తారని, ఒకవేల షారూఖ్ ఫోన్ చేస్తే విషయాన్ని పరిశీలిస్తానని తెలిపారు. అంతలోనే షారూఖ్ ఫోన్ చేయడంతో శాంతి భద్రతలను కాపాడే భాద్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని సీఎం హామీ ఇచ్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com