Pathan: దీపిక బికినీ గోల.. పొలిటీషియన్స్ వార్నింగ్

Pathan: దీపిక బికినీ గోల.. పొలిటీషియన్స్ వార్నింగ్
X
Pathan: ఏ సినిమాలో అయినా హీరోయిన్లు అందంగా కనిపిస్తే పొగుడుతారు. అసభ్యంగా ఉంటే తిడతారు. అదే జుగుప్సాకరంగా ఉంటే మాత్రం సినిమాకే ఎసరు పెడతారు.

Pathan: ఏ సినిమాలో అయినా హీరోయిన్లు అందంగా కనిపిస్తే పొగుడుతారు. అసభ్యంగా ఉంటే తిడతారు. అదే జుగుప్సాకరంగా ఉంటే మాత్రం సినిమాకే ఎసరు పెడతారు. గ్లామర్ పేరుతో వల్గారిటీని చూపిస్తే అది కూడా ఓ టాప్ హీరోయిన్ అయి ఉండీ అలా చేస్తే ఖచ్చితంగా అది సినిమాకు ఎఫెక్ట్ అవుతుంది తప్ప ఎసెట్ కాదు. లేటెస్ట్ గా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా నుంచి విడుదల చేసిన ఓ పాటలో దీపికా పదుకోణ్ చేసిన బికినీ ప్రదర్శన ఇప్పుడు ఆ సినిమాకే ఎసరు పెడుతోంది.. ఆ పాటను తొలగించకపోతే మా రాష్రంలో విడుదల కానివ్వం అంటూ పొలిటీషియన్స్ వార్నింగ్ లు ఇస్తున్నారు. మరి ఈ బికినీ గోల ఏంటో చూద్దాం.


షారుఖ్ ఖాన్ మోస్ట్ అవెయిటెడ్ మూవీగా చెప్పుకుంటోన్న సినిమా పఠాన్. కొన్నాళ్లుగా ఒక్క హిట్టూ లేక ఇబ్బంది పడుతున్నాడు షారుఖ్. ఒకప్పుడు బాక్సాఫీస్ బాద్ షాగా చెప్పుకున్నా.. ఇప్పుడు మాత్రం ఒక హిట్ కోసం చకోర పక్షిలా చూస్తున్నాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో పఠాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఆదిత్య చోప్రా నిర్మిస్తోన్న సినిమా ఇది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ తర్వాత షారుఖ్ సూపర్ హిట్ కొట్టబోతున్నాడు అని హ్యాపీగా ఫీలవుతున్నారు ఫ్యాన్స్.



అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ చిత్రంలో దీపికా పదుకోణ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రీసెంట్ గా ఈ మూవీ నుంచి బేషరమ్ అనే పాటను విడుదల చేశారు. పాటకు తగట్టుగానే దీపికా డ్రెస్సింగ్ అంతా బేషరమ్ గా ఉంది. పాటంతా బికినీలోనే ఎక్కువగా కనిపించింది. ఆల్రెడీ మరో స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ను పెళ్లి కూడా చేసుకున్న దీపిక ఈ రేంజ్ లో అందాలు ఆరబోస్తుందని ఎవరూ భావించలేదు. అయితే పాటలో చూపిన మూమెంట్స్ తో పాటు డ్రెస్సింగ్ కూడా అసభ్యతను దాటి జుగుప్సాకరంగా ఉన్నాయని చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. నిజంగా కూడా అలాగే ఉంది. షారుఖ్ కు లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.



వారు సినిమాకు రావాలంటే మరీ ఈ తరహా దిగజారుడు మూమెంట్స్ ఉంటే ఇబ్బంది పడతారు కూడా. ఇటు దీపికా కూడా ఆ మధ్య చేసిన గెహ్రైయాన్ అనే సినిమాలో ఓ రేంజ్ ఇంటిమేట్ సీన్స్ తో రెచ్చిపోయింది. అయితే అది కాస్త క్లాస్ గానే కనిపిస్తుంది. బట్ ఇది మాత్రం చాలా అసభ్యంగా ఉందంటున్నారు. మరి రణ్‌వీర్ సింగ్ రెస్పాన్స్ ఏంటో కానీ.. ఇప్పుడీ చిత్రంలోని ఆ పాటను తొలగించకపోతే మా రాష్ట్రంలో విడుదల కానివ్వం అంటూ మధ్యప్రదేశ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల పొలిటీషియన్స్ హెచ్చరిస్తున్నారు. జనవరి 25న విడుదల కాబోతోన్న పఠాన్ నుంచి ఈ పాటను తొలగిస్తారా లేక ఇలా పొలిటికల్ హీట్ ను ఫేస్ చేస్తారా అనేది చూడాలి.

బాబూరావు. కె

Tags

Next Story