Pathaan: ఏంటా డ్రస్సు.. ఏంటా స్టెప్స్..: 'పఠాన్' పై నెట్టింట్లో రచ్చ
Pathaan: షారుఖ్ ఖాన్ దాదాపు నాలుగేళ్ల తర్వాత 'పఠాన్' సినిమాతో తెరపైకి రాబోతున్నాడు. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే వివాదానికి తెరలేపింది. ఇంతకు ముందు కూడా కింగ్ ఖాన్ సినిమాలపై నిరసనలు వెల్లువెత్తాయి.
షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం 'పఠాన్'లోని 'బేషరమ్ రంగ్' పాటకు సంబంధించి ఇంటర్నెట్‌లో బహిష్కరణ ట్రెండ్ మొదలైంది. నటుడితో దీపికా పదుకొణె కెమిస్ట్రీని పాటలో చూపించారు. అయితే పాటలోని ప్రతి సన్నివేశంలో నటి బికినీలో దర్శనమిస్తుంది. దీపికా బట్టల రంగు కాషాయం అని, ఇది హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని 'పఠాన్' పాట గురించి కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని నిషేధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
2017న విడుదలైన షారుక్ ఖాన్ నటించిన 'రయీస్' చిత్రంపై కూడా అప్పట్లో వివాదాలు చెలరేగాయి. ఈ చిత్రంలో కింగ్‌ఖాన్‌కు జోడీగా పాకిస్థానీ నటి మహిరా ఖాన్ నటించింది. ఓ భారతీయ సినిమాలో పాకిస్థానీ ఆర్టిస్ట్ పని చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
షారుఖ్ ఖాన్ మరో చిత్రం 'మై నేమ్ ఈజ్ ఖాన్' విషయంలో కూడా అనేక వివాదాలు తలెత్తాయి. ఈ సినిమా కాన్సెప్ట్ మరియు దాని ట్యాగ్ లైన్ "మై నేమ్ ఈజ్ ఖాన్ అండ్ ఐ యామ్ నాట్ ఎ టెర్రరిస్ట్" గురించి జనాల్లో చాలా రచ్చ జరిగింది.
మరి తాజాగా వచ్చిన పఠాన్ పాటపై మేకర్స్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. విడుదలకు ముందే వివాదం.. ఇది కూడా ఓ రకమైన పబ్లిసిటీనే అని సరిపెట్టుకుంటారో లేక మారుస్తారో.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com