Pawan Kalyan is Back : పవన్ ఈజ్ బ్యాక్.. హరిహరవీరమల్లు వార్ సీన్స్‌లో ఎంట్రీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న 'హరి హర వీర మల్లు' చిత్రం ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. కీలకమైన అప్డేట్ ని తాజాగా విడుదల చేసింది మూవీ టీమ్. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ను తిరిగి ప్రారంభించినట్టు తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. ప్రముఖ యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ ఆధ్వర్యంలో ఒక భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరణ ప్రారంభించినట్టు ప్రకటించింది.
ఈ భారీ యుద్ధ సన్నివేశ చిత్రీకరణలో సుమారు 100-500 మంది ఫైటర్లు మరియు జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మరికొద్ది రోజుల్లో 'హరి హర వీర మల్లు' చిత్రీకరణ లో పాల్గొంటారని చిత్ర బృందం వెల్లడించింది. దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను తీసుకున్న తరువాత, ఇటీవల విడుదలైన టీజర్ అభిమానులతో పాటు, సినీ ప్రేమికులలో ఈ చిత్రంపై భారీ అంచనాలను ఏర్పడేలా చేసింది.
బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ సహా అనేక మంది ప్రముఖులు ఇందులో నటిస్తున్నారు. హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో తెరకెక్కుతోంది. త్వరలోనే రిలీజ్ కానుంది. అనేక భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com