Pawan Kalyan vs Ram Charan : నువ్వా నేనా అంటున్న బాబాయ్.. అబ్బాయ్..!

Pawan Kalyan vs Ram Charan : తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోల మధ్య వార్ మరోసారి తెరపైకి వచ్చింది. పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ నువ్వా నేనా అంటూ సిల్వర్ స్క్రీన్‌పై పోటీ పడబోతున్నారు. ఈ నెల 25 న రామ్ చరణ్ నటించిన RRR మూవీ సిల్వర్ స్క్రీన్‌పై విడుదల అవుతుండగా… అదే రోజు OTT పై భీమ్లా నాయక్ సినిమాను పవన్ కళ్యాణ్ విడుదల చేస్తున్నారు. . ఆహాతోపాటు, డిస్నీ హాట్‌స్టార్‌లోనూ భీమ్లా నాయక్ సందడి చేయనుంది. బాబాయ్, అబ్బాయ్ మధ్య ఎందుకీ పోటీ..?
గతంలో పుష్ప OTT రిలీజ్ టైమ్‌లోనూ ఇలాగే జరిగింది. డిసెంబర్ 17 వ తేదీన పుష్ప సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే పబ్లిక్ లో క్రేజ్ ను, సంక్రాంతి పండుగ మూమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు జనవరి 7 వ తేదీనే OTT లోకి వచ్చేసింది. నిజానికి అదే రోజున.. RRR సినిమాను థియేటర్లలో రిలీజ్ చేద్దామనుకున్నారు. అయితే కోవిడ్ థర్డ్ వేవ్ నిబంధనల కారణంగా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతి ఇవ్వడంతో... గిట్టుబాటు కాదంటూ RRR వాయిదా వేసుకున్నారు.
నిజానికి థియేటర్ రిలీజ్‌కి, OTTకి మధ్య కనీసం 50 రోజులు గ్యాప్ ఉండాలని అనుకున్నారు. అలాగైతేనే ఎవరికీ ఇబ్బందులు కలగవనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా వారం రోజుల్లోపే డబ్బులు రాబట్టుకోవాల్సిన పరిస్థితి. అలాంటిది అదే తేదీల్లో మరో క్రేజీ ప్రాజెక్టు ఇంకో ప్లాట్ ఫామ్ లో వస్తే ఇబ్బందులు తలెత్తుతాయన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో నిర్మాతలే రెండు నెలల గ్యాప్ లాంటి కండిషన్ పెట్టుకున్నారు. అయితే అది ఆచరణలో కనిపించకపోడం ఆందోళన రేకెత్తిస్తోంది. వాస్తవానికి పెద్ద సినిమాల విషయంలో ఈ ఇబ్బంది ఉండదు.
ఈ హీరో ఫ్యాన్స్ వారికి ఉండారు.. ఏ సినిమా క్రేజ్ దానికి ఉంటుంది. ఇప్పుడు వచ్చిన బాబాయ్ అబ్బాయ్ క్లాష్‌నే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. మొత్తం మీద ఏపీలో సినిమా టికెట్ల గొడవ, స్టార్ సినిమాల మధ్య కూడా వివాదం రేపుతోంది. సాక్షాత్తూ అబ్బాయి, బాబాయిల సినిమాలు ఒకేరోజు సిల్వర్ స్క్రీన్, ఓటీటీల్లో విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది. అతి భారీ బడ్జెట్‌తో రూపొందించిన RRR సినిమాకు దీటుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై గతంలో పుష్ప రిలీజ్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాగా… ఇప్పుడు బీమ్లా నాయక్ హాట్‌స్టార్, ఆహాలో రిలీజ్ అవుతోంది. ఇది మెగా ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com