'భీమ్లా నాయక్' గ్లింప్స్.. రికార్డు స్థాయి వ్యూస్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ డేట్స్ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచుస్తున్నారు. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించింది. సినిమా టైటిల్‌ని చిత్రబృందం ఆదివారం ఉదయం అధికారికంగా ప్రకటించింది. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్-రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈమేరకు 'భీమ్లా నాయక్' అనే పేరు ఖరారు చేశారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ వీడియో విషయానికి వస్తే.. 'ఒరేయ్ డేనీ.. బయటకు రారా.. ' అంటూ పవర్‌స్టార్ పవర్‌ఫుల్ ఎంట్రీ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. 'డేని.. డేనియల్ శేఖర్' అని రానా తన పేరు చెప్పగానే.. 'భీమ్లా..భీమ్లా నాయక్.. ఏంటి చూస్తున్నావ్.. కింద క్యాప్షన్ లేదనా..అక్కర్లేదు బండెక్కు' అంటూ పవర్‌స్టార్ వేసిన డైలాగ్ అందరితో ఈలలు వేయించేలా ఉంది.
మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, బీజుమేనన్ ప్రధాన పాత్రలుగా మలయాళంలో సూపర్‌హిట్ అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియమ్'కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. బీజుమేనన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్, పృథ్వీరాజ్‌కుమార్ పోషించిన పాత్రలో రానా కనిపించనున్నారు. నిత్యామేనన్, ఐశ్వర్యా రాజేశ్ కథానాయికలు. పవర్‌ఫుల్ కథాంశంతో సిద్ధమవుతోన్న ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ భీమ్లానాయక్ అనే పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే సెప్టెంబర్ 2 నుంచి 'భీమ్లానాయక్' పాటలు ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com