సినిమా

పవన్ కళ్యాణ్, రానా మూవీ క్రేజీ అప్డేట్.. టైటిల్ డేట్ ఫిక్స్

Pawan Kalyan - Rana Movie: పవన్, రానా కలిసి నటిస్తున్న మూవీకి సంబందించిన అప్ డేట్ రానేవచ్చింది.

పవన్ కళ్యాణ్, రానా మూవీ క్రేజీ అప్డేట్.. టైటిల్ డేట్ ఫిక్స్
X

Pawan Kalyan - Rana : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ డేట్స్ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తారు. తాజాగా పవన్, రానా కలిసి నటిస్తున్న మూవీకి సంబందించిన అప్ డేట్ రానేవచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఉదయం9 గంటల 45 నిమిషాలకు టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

మలయాళంలో హిట్టైన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' మూవీ రీమేక్ ఒకటి. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ కథానాయికగా నటిస్తోంది. రానాకు జోడిగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ .. భీమ్లా నాయక్' అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే భీమ్లా నాయక్ పోస్ట్ రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటు 'హరి హర వీరమల్లు' అనే సినిమాలోను నటిస్తున్నారు. ఈ మూవీకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా త్వరలో చిత్రీకరణ జరపుకోనుంది. ఈ మూవీని ఏ యం రత్నం నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో అన్ని భాషాల్లో విడుదల చేయనుంది చిత్రబృందం. మరోవైపు రానా హీరోగా నటించిన 'విరాట పర్వం' సినిమా త్వరలో విడుదల కానుంది.Next Story

RELATED STORIES