Bheemla Nayak : భీమ్లానాయక్ నుంచి మరో పాట.. ఆకట్టుకున్న 'అడవి తల్లి మాట'

Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న సినిమా భీమ్లానాయక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఈ రోజు నాలుగో పాటను విడుదల చేశారు. అడవి తల్లి మాట అంటూ సాగే ఈ పాట ఎంతో హృద్యంగా చిత్రీకరించారు. పాటలోని లిరిక్స్ సాహిత్య ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రిమేక్‌గా వస్తుంది. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్‌డేట్ వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతోంది.. పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనడానికి ఇదే నిదర్శనం. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంతో తాజాగా నాలుగో సింగిల్‌ను విడుదల చేశారు యూనిట్ సభ్యులు. ఇక ఈ చిత్రానికి కూడా సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు సమకూర్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com