Pawan Kalyan: 'అభిమానించే స్థాయి నుంచి ఆరాధించే స్థాయికి'.. పవర్ స్టార్ బర్త్‌డే స్పెషల్

Pawan Kalyan: అభిమానించే స్థాయి నుంచి ఆరాధించే స్థాయికి.. పవర్ స్టార్ బర్త్‌డే స్పెషల్
"చరిత్రలో మనం ఉండటం కాదు మనమే ఒక చరిత్ర కావలి". సినిమా నటుల గురించి చెప్పేటప్పుడు ఇలాంటి బరువైన పదాలు అవసరం లేదు.

Pawan Kalyan: "చరిత్రలో మనం ఉండటం కాదు మనమే ఒక చరిత్ర కావలి". సినిమా నటుల గురించి చెప్పేటప్పుడు ఇలాంటి బరువైన పదాలు అవసరం లేదు. కానీ మనం చెప్పుకోబోయేది పవన్ కల్యాణ్ గురించి కదా. ఆ మాత్రం ఉండాల్సిందే. అసలు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే.. ఓ ప్రభంజనం. అక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పుడు చిరంజీవి చిన్న తమ్ముడట.. ఓసారి చూద్దాం పద.. ఎలా యాక్ట్ చేశాడో అని అనుకున్నారు. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ అంటే.. పవర్ ఫుల్ మ్యాన్. మానవత్వం ఉన్న హ్యూమన్. తెలుగు రాజకీయాలను ప్రభావితం చేసే పొలిటీషియన్. అన్నింటికీ మించి తెలుగు సినిమాకు.. క్లాస్ లుక్‌తో పాటు మాస్ ఇమేజ్‌ను తెచ్చిన ఎనర్జిటిక్ హీరో.



"అభిమానించే స్థాయి నుంచి ఆరాధించే స్థాయికి" చేరిన ఆయన లైఫ్ జర్నీని చూడండి.. అందులో సరదా ఉంటుంది. స్ఫూర్తి ఉంటుంది. ఆవేశం ఉంటుంది. ఆలోచన ఉంటుంది. ఇంతకుమించి.. ఇంకేదో ఉందనిపిస్తుంది. పవన్ అంటే అదే. ఇండస్ట్రీలో మరే ఇతర స్టార్ హీరోకి లేని ఫాలోయింగ్ పవన్ సొంతం. వరుసగా 10 సినిమాలు ఫ్లాప్ ఐనా.. క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కల్యాణ్ డైలాగ్ డెలివరీకి.. థియేటర్లో అరుపులు ఓ రేంజ్‌లో ఉంటాయంతే. పవర్ స్టార్ ఫ్యాన్ బేస్ ఏంటో చెప్పాలంటే.. అంత ఈజీ కాదు. జస్ట్ అలా తెరమీద కనిపిస్తే చాలు ఊగిపోతుంటారు ఫ్యాన్స్. ఆ అభిమానం అలాంటిది. మాములుగా హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు కానీ.. హీరోలనే ఫ్యాన్స్‌గా ఉన్న స్టార్ హీరో పవన్ కళ్యాణ్. అందుకే కదా ఆయనను క్రేజ్ కా బాప్ అనేది. మానవతావాదిగా ఎన్నో సేవలు అందించిన పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు 50 ఏళ్లు.



1971 సెప్టెంబరు 2.. బాపట్ల ఈ తేదీని ఎప్పుడూ మర్చిపోదు. ఎందుకంటే.. కొణిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకి పవన్ జన్మించింది.. అప్పుడే.. అక్కడే. టీనేజ్‌లో పీక్స్‌కి చేరుకున్న కుర్రకారుకు.. తొలిప్రేమ సినిమా అంటే ఓ పిచ్చి. దాన్ని ఓసారయినా చూసేయాల్సిందే. ఆ సినిమాకి అంత క్రేజ్ వచ్చింది పవన్ యాక్టింగ్ తోనే. అసలు.. ఆ సినిమాతోనే.. లవ్ స్టోరీని ఇంత బ్యూటిఫుల్‌గా తీయచ్చా అని టాలీవుడ్‌కు తెలిసొచ్చింది. అప్పటివరకి చిరంజీవి తమ్ముడు‌గా ఉన్న పవన్.. ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యక స్టైల్ ని, స్టార్ డమ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. తరువాత వచ్చిన.. తమ్ముడు, బద్రి, ఖుషి.. ఇలా ఏ సినిమా చూసినా.. బంపర్ హిట్టు, బాక్సాఫీస్ బద్దలు.



కేవలం యాక్టింగ్ దగ్గరే ఆగిపోతే.. కెరీర్ కు ప్లస్ పాయింట్ అవ్వదు. అందుకే జానీతో మెగా ఫోన్ అందుకున్నాడు పవన్. డైరెక్టర్ గా ఫస్ట్ మూవీ సక్సెస్ కాలేదు. ఇదే క్రమంలో 10 సినిమాలు ఫ్లాప్స్. మరో హీరో అయితే డిప్రెషన్ లోకి వెళ్లిపోయేవాడు. కానీ ఇక్కడున్నది పవన్. అందుకే.. ఆ ఫ్లాప్‌లకి అక్కడే ఫుల్ స్టాప్ పెట్టేశాడు. పవర్ ఈజ్ బ్యాక్ అంటూ 2012లో వచ్చిన "గబ్బర్ సింగ్" చిత్రం తెలుగు సినిమా రికార్డులను తిరగరాసి.. పవన్ కళ్యాణ్ హిట్ కొడితే.. ఆ రేంజ్ ఎలా ఉంటుందో బాక్స్ ఆఫీస్‌కి మరోసారి రుచి చూపించాడు. ఆ తరువాత వచ్చిన అత్తారింటికి దారేది సినిమా.. పవన్ ఇమేజ్ ను ఎక్కడికో తీసుకెళ్లింది. ఈ సినిమా విడుదలకి ముందే 90 నిముషాల పైరసీ వీడియో ఇంటర్నెట్‌లో లీకైనా అస్సలు పట్టించుకోలేదు పవన్ అభిమాన గణం.. మా హీరో రేంజ్ ఏంటో మాకు తెలుసుకు అనుకున్నారు. ఆ సినిమా హిట్‌ను ఎవ్వరూ ఆపలేకపోయారు. అదీ పవన్ ఫ్యాన్స్ అంటే.



పవన్ కి ముందునుంచే సామాజిక స్పృహ ఎక్కువ. అందుకే ఆమధ్య కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (CMPF) అనే సంస్థని స్థాపించి 2 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. నటుడిగా, రాజకీయవేత్తగా, సమాజ సేవకుడిగా ఆయన చేసిన సేవలను గుర్తించి.. 2017 లో ఇండో-యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ "గ్లోబల్ ఎక్సెలెన్స్" పురస్కారంతో సత్కరించింది. చెగువేరా, గుంటూరు శేషాద్రి శర్మ వంటి వ్యక్తుల జీవితాలను ఎక్కువగా ఫాలో అవుతుంటారు పవన్ కళ్యాణ్. ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే జనసేన పార్టీని స్థాపించి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లారు. 2019లో జరిగిన ఎన్నికల్లో భీమవరం, గాజువాకలలో పోటీ చేసినా.. రెండు చోట్లా ఓటమి తప్పలేదు. కానీ రాజకీయాలంటే.. గెలుపోటములు కాదు.. ప్రజా సేవ మాత్రమే అని ధైర్యంగా చెప్పినప్పుడే.. పవన్ అంటే ఏంటో.. మరోసారి అందరికీ తెలిసొచ్చింది. 2021లో విడుదలైన "వకీల్ సాబ్" మూవీతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. సినిమాలు, రాజకీయాలు, ప్రజాసేవ.. వీటన్నింటిలోనూ పవన్ రాణించాలని.. ఆయన చేసే పనులతో అభిమానులు, ప్రజలు అందరికీ మేలు కలగాలని కోరుకుంటూ.. పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

Tags

Read MoreRead Less
Next Story