Pawan Kalyan : హ్యాపీ బర్త్ డే ఓ.జి.. పవన్ కు ‘ఓమి’గ్రీటింగ్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న మూవీ ‘ఓ.జి’. సుజిత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ నుంచి తాజాగా పవన్ బర్త్ డే స్పెషల్ గా ఓ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. బట్ బర్త్ డే పవన్ ది అయితే వీడియో అంతా విలన్ ఇమ్రాన్ హష్మితో నింపేయడం కాస్త నిరాశ పరిచింది. చివర్లో ఆ కత్తి పట్టుకున్న షాట్ మాత్రమే పవన్ ది. మిగతా అంతా ఇమ్రాన్ హైలెట్ గా కనిపించాడు. మరి ఇలా ఎందుకు కట్ చేశారో కానీ.. విలన్ గా నటించిన ఇమ్రాన్ ‘హ్యాపీ బర్త్ డే ఓ.జి’అనే చెప్పే డైలాగ్ వేశారు. ఆ డైలాగ్ కోసం అతన్నే హైలెట్ చేయడం ఏంటో మరి.
గ్లింప్స్ గా చూస్తే.. ‘డియర్ ఓ.జి నిన్ను కలవాలనీ.. నీతో మాట్లాడాలనీ.. నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నా.. నీ ఓ.మి’ అనే ఇమ్రాన్ డైలాగ్ తో మొదలై.. అతని క్రూరత్వాన్ని చూపే సన్నివేశాలతో.. చివరికి ‘హ్యాపీ బర్త్ డే ఓ.జి’అనే చెప్పే డైలాగ్ కనిపిస్తుంది. ఈ నెల 25న విడుదల కాబోతోన్న సినిమా కాబట్టి కాస్త ఎక్కువ వీడియో రిలీజ్ చేసినా ప్రమోషనల్ గానూ ఉపయోగపడేదే.
మొత్తంగా డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రంలో పవన్ కు జోడీగాప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. విలన్ గా ఇమ్రాన్ హష్మీ.. ఇతర కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ నటించారు. థమన్ మ్యూజిక్ అందించిన సినిమా ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉంది. ఏదేమైనా ఈ బర్త్ డే వీడియోలో పవన్ కంటే ఇమ్రాన్ హైలెట్ చేయడాన్ని ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com