Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' గ్లాన్స్.. మస్తు ఖుషీలో పవన్ ఫ్యాన్స్ ..

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు హరిహర వీరమల్లు టీమ్ ఓ చిన్న గ్లాన్స్ ఇచ్చి ఫ్యాన్స్‌ని ఖుషీ చేసింది. పీరియాడికల్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తు్న్నారు. నేడు (శుక్రవారం) పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఉదయం విడుదల చేసింది.
మెడల్ని వంచి కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పెట్టుకొని తొడకొట్టాడో తెలుగోడు అనే పాటలో పవన్ ఫైట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. భీమ్లానాయక్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌లో వస్తున్న ఈ చిత్రానికి దయాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com