Pawan Kalyan: హైదరాబాద్‌లో పవన్ కొత్త ఫ్లాట్.. రేట్ ఎంతంటే..

Pawan Kalyan (tv5news.in)
Pawan Kalyan: ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. 'భీమ్లా నాయక్' హిట్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇక పవన్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ముందుగా విడుదలయిన 'వకీల్ సాబ్'కంటే 'భీమ్లా నాయక్' మరింత సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అంతే కాకుండా కలెక్షన్స్ కూడా అదే రేంజ్‌లో రాబడుతోంది. అయితే ఇదే సమయంలో పవన్ ఓ కొత్త ఫ్లాట్ కొన్నాడన్న కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పవన్ ఎక్కువగా సింపుల్‌గా ఉండే లైఫ్‌స్టైల్‌నే ఇష్టపడతారు. అందుకే ఎక్కువగా ప్రజల మధ్యే ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్‌లో ఓ ఇల్లు ఉంది. అంతే కాకుండా ఇటీవల జనసేన పార్టీ ఆఫీస్‌ను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇవి మాత్రమే కాకుండా పవన్ కొత్తగా ఓ ఫ్లాట్ కూడా కొన్నట్టు సమాచారం.
పవన్ కొత్త ఫ్లాట్ హైదరాబాద్‌లోని ఖాజాగూడలో ఉందని సమాచారం. 1200 చదరపు గజాల ఈ ఫ్లాట్ విలువ రూ. 24 కోట్లు ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నాడు పవన్. తన అప్‌కమింగ్ చిత్రాలు కూడా చాలావరకు రీమేక్‌లే. తమిళంలో హిట్ అయిన 'వినోదయ సితం' సినిమాను పవన్ తెలుగులో రీమేక్ చేస్తున్నాడా? లేదా? అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com