Pawan Kalyan : ఆపద్బాంధవుడు అన్నయ్య: పవన్ కళ్యాణ్

Pawan Kalyan : ఆపద్బాంధవుడు అన్నయ్య: పవన్ కళ్యాణ్
X

మెగాస్టార్ చిరంజీవికి ఆయన తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేశారని కొనియాడారు. కావాల్సిన వారి కోసం ఎంతవరకైనా తగ్గుతారని, ఆ గుణమే చిరంజీవిని సుగుణ సంపన్నుడిగా చేసిందన్నారు. జనసేనకు రూ.5 కోట్లు విరాళమిచ్చి విజయంలో సహకరించిన ఆయన చిరాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నట్లు పవన్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవికి సినీ స్టార్లు అల్లు అర్జున్, వెంకటేశ్, బీఆర్ఎస్ నేత కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మా మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ ఐకాన్ స్టార్ ట్వీట్ చేశారు. ‘నా స్నేహితుడు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని వెంకీ మామ తెలిపారు.

Tags

Next Story