Vijayendra Prasad : RRR కోసం ముందుగా పవన్ కళ్యాణ్‌ని హీరోగా అనుకున్నాం.. కానీ
Vijayendra Prasad : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్.. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డులను బద్దలు కొడుతూ సంచలనం సృష్టిస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 750 కోట్లు వసూళ్ళు సాధించి దూసుకుపోతోంది.
అయితే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇటీవల మీడియాతో పంచుకున్నారు RRR కథ రచయిత విజయేంద్రప్రసాద్.. ఈ సినిమా స్క్రిప్టింగ్ దశలో దర్శకుడు రాజమౌళి ఒక హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరును అనుకున్నారని తెలిపాడు.. కానీ పవన్ కళ్యాణ్‌తో సరిపోయే పవర్‌ఫుల్ స్టార్ మరొకరు దొరకకపోవడంతో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో ముందుకు వెళ్లామని తెలిపాడు.
పవన్ కళ్యాణ్ గొప్ప స్టార్ అని, ఆయనకున్న క్రేజ్, చరిష్మా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరికీ లేదని ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ అన్నారు. కాగా డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన RRR మూవీలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటించి ఆకట్టుకున్నారు. వీరి సరసన అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. కీరవాణి సంగీతం అందించారు.
ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేసేందుకు సిద్దమవుతున్నారు విజయేంద్రప్రసాద్, రాజమౌళి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com