Pawan Kalyan : వచ్చే సంక్రాంతికి పవన్ కళ్యాణ్

సంక్రాంతి అంటే టాలీవుడ్ కు ఎంత ఇష్టమో వేరే చెప్పక్కర్లేదు. ఆల్రెడీ సంక్రాంతికి రాబోతున్నాం అని చెప్పేశాడు అనిల్ రావిపూడి. అతను వెంకటేష్ తో మరోసారి సంక్రాంతికి వస్తున్నాడు. ఇది ఫిక్స్ అయింది. అనూహ్యంగా ఇదే బరిలో పవన్ కళ్యాణ్ కూడా ఉండబోతున్నాడు అనిపించాడు. వచ్చే యేడాది సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ నిలవబోతున్నాడు అనిపించేలా ఉంది. పవన్ చాలాకాలం క్రితమే అయిన సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమా ఆ వేదిక కాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ సాగుతుంది. అంటే ఈ కథ ముందుగా అనుకున్నది కాదేమో. వక్కంతం వంశీ కథ అందిస్తున్నాడు. తాళ్లూరా రామ్ నిర్మించబోతోన్న మూవీ ఇది.
ఇక ఈ మూవీ వచ్చే యేడాది సంక్రాంతి బరిలో ఉండబోతోంది అనిపించేసింది. 2027 జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు అని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గానూ బిజీగా ఉండబోతున్నాడు. ఆ కారణంగా ఈ మూవీ చాలా త్వరగా స్టార్ట్ చేయాలనుకున్నారు. అంటే రిలీజ్ కు చాలా టైమ్ ఉన్నా.. షూటింగ్ విషయంలో పూర్తి స్థాయిలో క్లారిటీ ఉండదు కాబట్టి ఈ ఉగాదినే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఉగాదిన షూటింగ్ అంటే రిలీజ్ జనవరి అంటే చాలా టైమ్ ఉంటుంది. ఈ మధ్యలో ఆయన బిజీగా ఉన్నా ఇబ్బంది ఉండదు. సో ఈ కారణంగా సంక్రాంతి బరిలో నిలవడం పెద్ద కష్టమేం కాదు. మొత్తంగా పవన్ కళ్యాణ్ కూడా సంక్రాంతి బరిలో నిలవడం ఖాయం అయిపోయింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
