Pawan Kalyan: మేనల్లుడి సినిమాకు సీక్వెల్ చేయనున్న పవన్ కళ్యాణ్..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పటి నుండి చాలా బిజిబిజీగా గడిపేస్తున్నారు. అటు రాజకీయం.. ఇటు సినిమాలు రెండింటిని సమానంగా మ్యానేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 'భీమ్లా నాయక్' విడుదలకు సిద్ధమవుతుంగా మరో మూడు సినిమాలను లైన్‌లో పెట్టారు. తాజాగా తాను ఓ సినిమాకు సీక్వెల్ చేయనున్నాడన్న టాక్ వినిపిస్తోంది.
దర్శకుడు దేవ్ కట్టా, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'రిపబ్లిక్' చిత్రం సూపర్ హిట్‌ను సాధించింది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్నో సెన్సిటివ్ విషయాలను టచ్ చేశాడు దేవ్ కట్టా. పైగా ఇందులో సాయి ధరమ్ తేజ్, రమ్యకృష్ణల యాక్టింగ్ సినిమాకు పెద్ద ప్లస్‌గా మారింది. అయితే ఇదే సినిమాకు సీక్వెల్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట దేవ్ కట్టా. దాంట్లో హీరోగా పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని భావిస్తున్నాడట.
రిపబ్లిక్ లాగానే రిపబ్లిక్ 2 కూడా సూటిగా ఉంటుందని దేవ్ కట్టా తెలిపారు. రిపబ్లిక్ హిట్ అవ్వడంతో రిపబ్లిక్ 2 కూడా హిట్ టాక్ అందుకుంటుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. పైగా ఆఫ్ స్క్రీన్ అన్నింటిని ప్రశ్నించే తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో హీరోగా చేస్తే.. అది ఈ కథకు కూడా సూట్ అయ్యేలా ఉంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com