Pawan Kalyan : ఓ.జి ఆలస్యానికి పవన్ కళ్యాణ్ కారణం కాదట

ఏపి డిప్యూటీ సిఎమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అప్ కమింగ్ మూవీస్ గురించి సంచలన విషయాలు చెప్పాడు. ప్రస్తుతం ఆయన ఎక్కడికి వెళ్లినా ఓజి ఓజి అని అరుస్తున్నారు ఫ్యాన్స్. ఇది ఆయన్ని ఇరిటేట్ చేస్తోంది. ఆ మధ్య అభిమానులను సమయం సందర్భం తెలియదా అంటూ కసురుకున్నాడు కూడా. నిజమే.. ఫ్యాన్స్ ఆయన్ని పొలిటీషియన్ గానూ, హీరోగానూ చూడాలనుకుంటున్నారు. అందుకే అలా అరుస్తున్నారు. అయితే అసందర్భంగా అలా అరవొద్దని ఓ.జి నిర్మాతలు ఒక లెటర్ కూడా విడుదల చేశారు. ఇక తాజాగా ఈ సినిమాతో పాటు తన మిగతా సినిమాల గురించి కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్.
ఓ.జి 1980 - 90ల కాలంలో సాగే కథ అన్నాడు. ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అన్నాడు. అభిమానులు ఎక్కడికి వెళ్లినా.. OG OG అని అరుస్తున్నారు. అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి.. అన్ని సినిమాలకి నేను డేట్స్ ఇచ్చాను.. వాళ్ళు సరిగా సద్వినియోగం చేసుకోలేదు. హరిహర వీరమల్లు ఎనిమిది రోజులషూటింగ్ పెండింగ్ ఉంది. అన్ని సినిమాలు ఒక్కొక్క దానిని పూర్తి చేస్తాను.. అన్నాడు. దీంతో ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్స్ వల్ల ఈ సినిమాలు లేట్ అయ్యాయి అనుకుంటున్న వాళ్లకు ఆయన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. సో.. ఇది కేవలం దర్శక నిర్మాతల తప్పిదమే తప్ప.. పవన్ కళ్యాణ్ నుంచి ఎప్పుడూ ఇబ్బంది ఎదురు కాలేదు అన్నమాట. మొత్తంగా ఈ మార్చి 28న హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఉన్నారు. ఆయన ఇంకా 8 రోజులు షూటింగ్ చేస్తే చాలు అంటున్నాడు. చూస్తుంటే ఈ మూవీ చెప్పిన టైమ్ కు రిలీజ్ అయ్యేలానే ఉంది. కాకపోతే ఈ సారి దర్శక, నిర్మాతలు మళ్లీ ఏ మిస్టేక్ చేయకుండా పవన్ ఇచ్చిన డేట్స్ లో షూటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com