Pawan Kalyan : గ్యాంగ్ స్టర్ మోడ్ లో పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలతో బిజీగా కనిపిస్తున్నాడు. చాలాకాలం క్రితం కమిట్ అయిన హరిహర వీరమల్లును గత నెలలో పూర్తి చేశాడు. ఆ మూవీ ఈ నెల 12న విడుదల కావాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో వాయిదా పడింది. కొత్త డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేస్తాం అని చెప్పారు. ఇక ఫ్యాన్స్ అంతా ఈగర్ గా చూస్తోన్న ‘ఓ.జి’షూటింగ్ కూడా స్టార్ట్ చేశాడు పవన్. రీసెంట్ గా ముంబై షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్ లో అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ సందర్భంగా నటుడు అర్జున్ దాస్ పవన్ కళ్యాణ్ తో తీసుకున్న ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. అంటే ఫోటో కాదు.. ఫోటోలో ఉన్న పవన్ కళ్యాణ్ లుక్ చూసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
ఇక ఓ.జి నెక్ట్స్ షెడ్యూల్ విజయవాడలో స్టార్ట్ కాబోతోంది. నిర్మాత దానయ్య పవన్ ఇచ్చిన డేట్స్ కంటే అదనంగా మరో వారం రోజులు కూడా తీసుకున్నాడట. అంటే ఆ వారం ముందు అనుకున్న దాంట్లో లేదు. సో.. ఈ టైమ్ లో ఏమైనా ప్యాచ్ వర్క్ లు ఉంటే కంప్లీట్ చేస్తారు. మొత్తంగా ఓ.జి చిత్రాన్ని పవన్ ఇచ్చిన డేట్స్ ఏ మాత్రం వృథా కాకుండా శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ విలన్. థమన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాను రీసెంట్ గా అనౌన్స్ చేసినట్టు సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com