Pawan Kalyan : భార్య కోసం సింగపూర్ లో పవన్ కళ్యాణ్

ఏపి డిప్యూటీ సిఎమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన భార్య అన్నాలెజినోవాతో కలిసి ప్రస్తుతం సింగపూర్లో ఉన్నాడు. కొన్ని రోజులుగా ఆయన పొలిటికల్ యాక్టివిటీస్ లో కనిపించకపోవడానికి కారణం అదే. అన్నా లెజినోవా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది. ఆ పట్టా తీసుకునేందుకే ఈ జంట సింగపూర్ వెళ్లింది. అక్కడికి ఎందుకు అంటే.. అన్నా మాస్టర్స్ చేసింది అక్కడి ఓ ప్రముఖ యూనివర్శిటీలో కాబట్టి. కొన్నాళ్ల క్రితం కొందరు రాజకీయ నాయకులు ఆమె సింగపూర్ లో ఉంటోంది.. ఇద్దరూ విడిపోయారు అనే దుష్ప్రచారం చేశారు. కానీ అప్పట్లో ఆమె ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసమే కొన్నాళ్లు సింగపూర్ లో ఉన్నారనేది నిజం.
ఇక యూనివర్శిటీలో తన భార్య మాస్టర్ డిగ్రీ పట్టా తీసుకుంటుండగా పవన్ అక్కడే ఉండి అభినందనలు తెలియజేయడం చూస్తే ఈ కపుల్ ఎంత లవబుల్ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. పవన్, అన్నా 2013లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు అని అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం ఏపిలో రాజకీయాలు చాలా హాట్ గా ఉన్నాయి. ఈ తరుణంలో డిప్యూటీ సిఎమ్ గా పవన్ ఇక్కడ ఉంటే బావుండు అని అంతా అనుకుంటున్నారు. మరి ఈ కారణంగా ఆయన తిరిగి తెలుగు రాష్ట్రాలకు వచ్చేస్తారా లేక రష్యా వెళతారా అనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు ఆయన పూర్తి చేయాల్సిన ఓ.జి, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హరవీరమల్లు సినిమాల షూటింగ్ లకు సంబంధించిన అప్డేట్స్ కూడా రావాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com