HBD Pawan Kalyan: హార్వర్డ్ యూనివర్సిటీలో పవన్ స్ఫూర్తిదాయక ప్రసంగం.. మరోసారి సోషల్ మీడియాలో వైరల్..

HBD Pawan Kalyan: హార్వర్డ్ యూనివర్సిటీలో పవన్ స్ఫూర్తిదాయక ప్రసంగం.. మరోసారి సోషల్ మీడియాలో వైరల్..
HBD Pawan Kalyan: 2017లో అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీలో రాకింగ్ స్పీచ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్టార్ అనిపించుకున్నారు. అతని ప్రసంగం వింటూ ఎన్నారైలు చప్పట్లు కొడుతూ ఈలలు వేస్తూ పవన్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

HBD Pawan Kalyan: 2017లో అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీలో రాకింగ్ స్పీచ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్టార్ అనిపించుకున్నారు. అతని ప్రసంగం వింటూ ఎన్నారైలు చప్పట్లు కొడుతూ ఈలలు వేస్తూ పవన్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆయన మాటలను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఆయన పుట్టిన రోజు సందర్భంగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రసంగ ముఖ్యాంశం చూద్దాం..

సభను ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ.. 'నేను పెద్దగా చదువుకోలేదు, డ్రాపౌట్ కూడా. కానీ, నేను జీవితాన్ని & సమాజాన్ని అధ్యయనం చేయడంలో ఎప్పుడూ ముందుటాను. అనుకోకుండా నటుడిని అయ్యాను. మీరే నన్ను హీరోగా నిలబెట్టారు. మీలాంటి వాళ్ల వల్లే నా సినిమా కెరీర్ సక్సెస్ అయింది. నేను ఈ ఫీల్డ్‌లో చాలా సౌకర్యంగా ఉన్నాను కానీ ప్రజల సమస్యలకు పరిష్కారాలు దొరికినప్పుడే సంతృప్తి చెందగలను. సమాజానికి నా వంతుగా ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో జనసేనను తెరపైకి తెచ్చాను. మా వద్ద తుపాకులు లేవు కానీ సంకల్ప శక్తి ఉంది. దాన్నే ఆయుధంగా ఉపయోగించుకుంటున్నాను. ఏం జరిగినా ధైర్యం కోల్పోను.

మనం అందరం గాంధీ, అంబేద్కర్‌లను గౌరవిస్తాము. కానీ వారు చూపిన మార్గంలో నడుస్తున్నామా? మనం బోధించే వాటిని ఆచరించకపోతే ఉపయోగం లేదు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (CMPF) ప్రారంభించినప్పుడు నాకు బెదిరింపులు వచ్చాయి. నన్ను చంపేస్తానని లేఖలు కూడా పంపారు. ఇలాంటి బెదిరింపులకు భయపడి ఉంటే నేను ఈరోజు రాజకీయాల్లో ఉండేవాడిని కాదు. నన్ను నేను చాలా పరీక్షించుకుని, ఎలాంటి ఒడిదుడుకులనైనా తట్టుకోగలనన్న విశ్వాసాన్ని పొందిన తరువాతే రాజకీయాల్లోకి వచ్చాను. వ్యక్తిగతంగా నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. నేను అవకాశవాద రాజకీయాలను ద్వేషిస్తాను. రాజకీయాలు తమకు కళ్లలాంటివని కొందరు నేతలు అంటున్నారు.

నాకు రాజకీయం అంటే గౌరవప్రదమైన ఉద్యోగం. మన రాజ్యాంగం చాలా గొప్పది కానీ దాని అమలు మాత్రం ఆందోళన కలిగించే అంశం. సవాళ్లను ఎదుర్కోవడం ఇష్టం. నేను జాగ్రత్తగా ఉన్నాను కానీ నిర్భయంగా ఉన్నాను. నేను నా మాటలను జాగ్రత్తగా ఉపయోగిస్తాను. మీరు కూడా మీ జీవితంలో ఏదైనా ముఖ్య నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు 10 సార్లు ఆలోచించిన తర్వాతే తీసుకోండి. దాని గురించి ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత దానికే కట్టుబడి ఉండండి.

ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని ఎదుర్కోండి. పాలకులు ఎన్నికల వాగ్దానాలపై వెనక్కి తగ్గితే సహించను. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ-బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో ఏం చేస్తారో వివరించారు. అమలు విషయానికి వచ్చేసరికి ఏవో లెక్కలు చెబుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకోలేని విధంగా నాయకులు మాట్లాడుతున్నారు. మాట్లాడితే అబద్ధాలు చెబుతున్నారు.

నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో జనసేనను నడుపుతున్నాను. చాలా మంది విరాళాలు ఇచ్చారు కానీ నేను వాటిని భారంగా చూస్తున్నాను. జనసేన విరాళాన్ని స్వీకరించినట్లయితే, అది పారదర్శకంగా ఉంటుంది. అధికారమే జనసేన అంతిమ లక్ష్యం కాదు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఉన్నాం. అభిమానులు, యువత తమ విలువైన సూచనలు జనసేనకు అందించాలి. యువత అంటే రాజకీయ నాయకుల కొడుకులు/కూతుళ్లు మాత్రమేనా? మీరు యూత్ కాదా? ఈ వ్యవస్థ మారాలి. జనసేన విస్తరణకు భావసారూప్యత గల వ్యక్తులు కావాలి.

'జానీ హిట్ అయితే, నేను అప్పటికి సినిమాల నుంచి తప్పుకునేవాడిని. నటించడం మానేయండి అని అభిమానులు నన్ను అడగడంతో, నేను 7 చిత్రాల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకున్నాను. నేను సినిమాలను ప్రేమిస్తున్నాను. వాటి ద్వారా నాకు డబ్బు వస్తుంది. నాకు డబ్బు కావాలి కానీ దాని గురించి పిచ్చి మాత్రం లేదు. నాలో నటించే శక్తి, బలం ఉన్నంత వరకు సినిమాలకు సైన్ చేస్తూనే ఉంటాను'.

ఎడిసన్, మార్టిన్ లూథర్ కింగ్, జాన్ కెన్నెడీ, జార్జ్ వాషింగ్టన్ వంటి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అమెరికన్ల పేర్లను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. రాయప్రోలు సుబ్బారావు రాసిన 'ఏ దేశమేగినాఎందుకాలిడినా..పొగదరా నీ తల్లి భూమి భారతిని' అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. భారత్ మాతా కీ జై!'.

Tags

Read MoreRead Less
Next Story