Pawan Kalyan : ఓ. జి మరికొన్ని గంటల్లో మొదలు

Pawan Kalyan :  ఓ. జి మరికొన్ని గంటల్లో మొదలు
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న మూవీ ఓ.జి. అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని అర్థం. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత డివివి దానయ్య నిర్మిస్తోన్న మూవీ ఇది. ఓ.జిపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. అయితే అన్నీ కుదిరి ఉంటే ఈ మూవీ ఎప్పుడో విడుదలై ఉండేది. చివరికి లాస్ట్ డేట్ లా చెప్పుకున్న 2024 సెప్టెంబర్ 27 కూడా మిస్ అయిపోయింది. కనీసం ఈ సమ్మర్ లో అయినా వస్తుందనుకున్నారు ఫ్యాన్స్. బట్ పవన్ ఇంకా కొన్ని రోజులు ఈ మూవీకి కేటాయించాల్సి ఉంది. పొలిటికల్ బిజీ వల్ల షెడ్యూల్స్ సెట్ చేయలేపోతున్నాడు. ఫైనల్ గా ఆయన ఒప్పుకున్నాడు. నిన్నటి నుంచి మళ్లీ ఓ.జి షూటింగ్ స్టార్ట్ అయింది.

ఓ. జి షూటింగ్ కు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇంకా ఓ రెండు వారాలకు పైగా చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆయన ఈ బుధవారం నుంచి ఓ.జి సెట్స్ లో అడుగుపెడుతున్నాడు. రేపటి నుంచి ఎన్ని రోజుల వరకూ షూటింగ్ చేస్తాడో తెలియదు కానీ.. ఒకవేళ ఆయన నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తే అయిపోతుంది. వీలైనంత త్వరలోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓ.జి కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురు చూపులకు అతి త్వరలోనే ఎండ్ కార్డ్ పడతోందన్నమాట.

Tags

Next Story