డ్యూటీ ఎక్కిన పవర్ స్టార్.. స్టన్నింగ్ లుక్ వైరల్

డ్యూటీ ఎక్కిన పవర్ స్టార్.. స్టన్నింగ్ లుక్ వైరల్
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా ఒక భారీ మల్టి స్టారర్ రూపొందుతున్న విషయం తెలిసిందే.

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా ఒక భారీ మల్టి స్టారర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయుప్పనుం కోశియం" సినిమాకి ఇది రీమేక్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండటం విశేషం.

కరోన సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ ని ఈ మద్యనే తిరిగి పట్టాలెక్కింది. తాజాగా మొదలైన షెడ్యూల్ లో పవన్-రానా మద్య కీలక సన్నివేశాలతో పాటు ఒక యాక్షన్ ఎపిసోడ్ ని కూడా తెరకెక్కిస్తున్నట్టు చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సందర్బంగా చిత్ర బృందం సినిమా సెట్స్‌లో జరుగుతున్న షూటింగ్‌ విశేషాలతో కూడిన ఓ వీడియోను పంచుకుంది.

ఈ మూవీలో పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్" అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. రానా పాత్రకి సంబందించిన సమాచారం తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పేలాలేదు. తమన్ సంగీత సారద్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుగా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.


Tags

Next Story