Ravi Teja : పవన్ కళ్యాణ్ మూవీ రవితేజ కోసం

Ravi Teja :  పవన్ కళ్యాణ్ మూవీ రవితేజ కోసం
X

మాస్ మహారాజ్ రవితేజ మూవీస్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వరుసగా మూవీస్ వస్తున్నాయి.. అంతే వరుసగా పోతున్నాయి కూడా. ఈ మధ్య కాలంలో డబుల్ హ్యాట్రిక్ కు దగ్గరలో ఉన్నాడు సినిమాల విషయంలో. ప్రస్తుతం భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ చేస్తున్నాడు. ఈ సంక్రాంతికి విడుదల కాబోతోందీ మూవీ. కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నాడు. అషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆ తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్ లో ఓ మూవీ చేయబోతున్నాడు రవితేజ. ఈ టైమ్ లో అతనికి పవన్ కళ్యాణ్ మూవీ రావడం మాత్రం విశేషం.

పవన్ కళ్యాణ్ మూవీ అంటే.. అతను హీరోగా నటించబోవడం లేదు. అతని కోసం అనుకున్న మూవీని రవితేజ కు చేయబోతున్నారు. ఆ దర్శకుడు సురేందర్ రెడ్డి. యస్.. ఏజెంట్ మూవీ తర్వాత బాగా ఫీల్ అయిపోయిన తర్వాత సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ తో మూవీ చేయాలనుకున్నాడు. కానీ రకరకాల కారణాలతో ఈ ప్రాజెక్ట్ ను పవన్ కళ్యాణ్ వదులుకున్నాడు. ఇన్నాళ్ల తర్వాత సురేందర్ రెడ్డి ఆ కథతోనే రవితేజతో చేయాలనుకున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం అయితే వక్కంతం వంశీ కథను అందించబోతున్నాడు. మరి ఈ ఇద్దరు కలిసి రవితేజతో ఓ బ్లాక్ బస్టర్ అందించబోతున్నారు అనిపించేలా ఉంది. అట్ ద టైమ్ అసలు ముందు వీళ్లు అసలు పవన్ కళ్యాణ్ కే చెప్పిన కథతోనే ఈ సినిమాను చేస్తున్నారా లేదా అనే క్లారిటీ రావాల్సి ఉంది.

Tags

Next Story