సినిమా

Pawan kalyan : పవన్ కళ్యాణ్ కొత్త లుక్.. !

Pawan Kalyan : పవర్‌‌స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ లుక్‌‌లో పవన్ సరికొత్తగా కనిపిస్తున్నారు. చాలాసన్నగా అయ్యారు.

Pawan kalyan : పవన్ కళ్యాణ్ కొత్త లుక్.. !
X

Pawan Kalyan : పవర్‌‌స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ లుక్‌‌లో పవన్ సరికొత్తగా కనిపిస్తున్నారు. చాలాసన్నగా అయ్యారు. అంతేకాకుండా చాల గ్లామర్‌‌గా కూడా కనిపిస్తున్నారు. క్రిస్మస్, న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో కలిసి రష్యా వెళ్ళిన పవన్ తిరిగి హైదరాబాదుకి వచ్చారు.. ఈ క్రమంలో ఎయిర్ పోర్టులో పవన్ వీడియోని ఓ అభిమాని ట్విట్టర్ లో షేర్ చేయగా ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. అయితే పవన్.. హరీష్ శంకర్ సినిమా కోసమే స్లిమ్ అయ్యారని తెలుస్తోంది. హరీష్ డైరెక్షన్ లో పవన్.. భవదీయుడు భగత్‌సింగ్ అనే సినిమాని చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఇక భీమ్లా నాయక్ సినిమాని కంప్లీట్ చేశారు పవన్.. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ కరోనా వలన సినిమా వాయిదా పడింది. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. తమన్ సంగీతం అందించాడు.

Next Story

RELATED STORIES