Satyagrahi Movie: పవన్‌కు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన అప్పటినుండే ఉందా..?

pawan kalyan (tv5news.in)
Satyagrahi Movie: సినిమా ప్రారంభంలోనే షూటింగ్ పూర్తవుతుందా, ఒకవేళ పూర్తి చేసుకున్నా ప్రేక్షకుల ముందుకు వెళ్తుందా.. లాంటివి ఎవరూ చెప్పలేరు. అన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించాలన్న ఉద్దేశ్యంతోనే ప్రారంభమవుతాయి. కానీ అందులో కొన్ని మధ్యలో ఆగిపోతాయి కూడా. దానికి చాలా కారణాలే ఉండొచ్చు. దర్శకులు ఒక కథ కోసం అనుకున్న హీరో ఒప్పుకోక ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటే పవన్ కళ్యాణ్ నటించాల్సిన సత్యాగ్రహి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'సత్యాగ్రహి' అనే ఒక పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేయాల్సింది. ఇది లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ చేసిన ఎమర్జెన్సీ మూమెంట్ ఆధారంగా తెరకెక్కాల్సిన చిత్రం. 2003లో ప్రారంభమయిన ఈ సినిమా నుండి పవన్ కళ్యాణ్ తప్పుకున్నాడు. అసలైతే ఈ సినిమా కథను పవన్ సొంతంగా రెడీ చేసుకున్నాడు. తానే దీనికి దర్శకత్వం కూడా వహించాలనుకున్నాడు. కానీ రాజకీయాలపై సినిమాలు చేయడం కంటే రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయడం మేలు అని పవన్ కళ్యాణ్ అప్పట్లోనే అనుకున్నాడట.
అజ్ఞాతవాసి సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాలపై దృష్టిపెట్టాడు పవన్ కళ్యాణ్. కానీ 2003 నుండే ఆయనకు ఈ ఆలోచన ఉందని పవన్ పెట్టిన ఫేస్‌బుక్ పోస్ట్ చూస్తే అర్థమవుతోంది. ఉన్నట్టుండి 'సత్యాగ్రహి' సినిమా గురించి పవన్ ఇప్పుడెందుకు పోస్ట్ చేసారని ఫ్యాన్స్ కన్ఫ్యూషన్‌లో పడ్డారు. మరికొందరు మాత్రం రాజకీయాలపై సినిమాలు చేయడం కంటే రాజకీయాల్లోకి రావాలన్న ఆయన ఆలోచన గొప్పదని ప్రశంసలు కురిపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com