Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓ.జి రిలీజ్ డేట్ ఇదే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో మొదలైన సినిమా ‘ఓ.జి’. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనేది ఫుల్ ఫామ్. ముంబై అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో పవన్ ను నటోరియస్ గ్యాంగ్ స్టర్ గా చూపిస్తూ సుజిత్ రూపొందిస్తోన్న ఈ మూవీ మాగ్జిమం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ లోగా ఏపిలో ఎన్నికలు రావడంతో పవన్ సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. బట్ ఓ 15 -20 రోజులు డేట్స్ కేటాయిస్తే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పోర్షన్ కంప్లీట్ అయిపోతుందని ముందు నుంచీ చెబుతున్నారు. ఇప్పుడు ఆయన ఏపికి డిప్యూటీ సిఎమ్. ఇంకా బిజీ అయ్యాడు.
నిజానికి ఎన్నికలు అయిన వెంటనే షూటింగ్ కు వెళతాడు అనుకుని మేకర్స్ సెప్టెంబర్ 27న రిలీజ్ అని అఫీషియల్ గా ప్రకటించారు. బట్ సీన్ మారింది. అందుకే కొత్త డేట్ విషయంలో ఓ క్లారిటీ లేదు. తాజాగా ఆ క్లారిటీ ఇచ్చాడు నిర్మాత దానయ్య. ఈ చిత్రాన్ని మార్చి 27న విడుదల చేస్తాం అని ప్రకటించాడు. అంటే చాలా టైమ్ ఉంది కాబట్టి ఈ మూడు నెలల్లో పవన్ ఎప్పుడు డేట్స్ ఇచ్చినా నాన్ స్టాప్ గా షూటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు సుజిత్. అయితే ఈ మొత్తం షూటింగ్ పార్ట్ ను విజయవాడలోనే పెట్టాలి అనే కండీషన్ పవన్ నుంచి వచ్చిందనే వార్తలు కూడా వచ్చాయి. ఎక్కడ చేస్తే ఏంటీ.. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ రీ రిలీజ్ జోష్ లో ఉన్నారు. ఈ టైమ్ లో ఓ.జి రిలీజ్ డేట్ కూడా వచ్చేసిందంటే ఇంతకు మించిన బర్త్ డే స్పెషల్ ఏముంటుంది వారికి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com