AM Ratnam : ఏ.పి ఎఫ్.డి.సి ఛైర్మన్ గా ఏఎమ్ రత్నంను ప్రతిపాదించిన పవన్

AM Ratnam :  ఏ.పి ఎఫ్.డి.సి ఛైర్మన్ గా ఏఎమ్ రత్నంను ప్రతిపాదించిన పవన్
X

పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల పరంగా బ్యాక్ బౌన్స్ కావడం ఫ్యాన్స్ లో కొత్త జోష్ తెస్తోంది. ఈ నెల 24న విడుదల కాబోతోన్న హరిమర వీరమల్లు మూవీ విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కు ఆయన కూడా అటెండ్ కావడం ఇండస్ట్రీలోనూ ఆశ్చర్యాన్ని కలిగించింది. అందునా ఇవాళే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉండటం.. ఉదయం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కు పవన్ రావడం ఫ్యాన్స్ కే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ లోనూ ధైర్యాన్ని నింపుతుందని చెప్పొచ్చు. అంతే కాక ఆయన మాట్లాడిన మాటలు.. కొన్నాళ్లుగా చూస్తే తన సినిమా గురించి పవన్ ఇంతలా ఎప్పుడూ చెప్పలేదు. తను ఇతర హీరోల కంటే చిన్నవాడిని చెప్పుకున్నాడు. వాళ్లంత బడ్జెట్ కానీ కలెక్షన్స్ కానీ తన సినిమాకు ఉండవు అని నిజాయితీగా చెప్పడం అందరికీ నచ్చింది. దర్శకుడు జ్యోతికృష్ణ, సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసల ప్లానింగ్ గురించి హైలెట్ చేశాడు. దర్శకుడిని తెగ పొగిడేశాడు.

తను ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఈ మూవీ కోసం వాడటం బాగా నచ్చిందన్నాడు. అన్నిటికంటే హైలెట్ ఏంటంటే.. పవన్ రెండు నెలలు టైమ్ ఇస్తే సినిమా పూర్తి చేసుకుంటాం అనే కాలంలో ఈ సినిమా క్లైమాక్స్ కోసం ఆయన ఏకంగా 57 రోజులు కేటాయించాడట. అది కూడా మండుటెండలో షూటింగ్ అన్నాడు. తన టైమ్ అడ్జెస్ట్ చేసుకుంటూ ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ సానపెట్టుకుంటూ.. ఫైట్ మాస్టర్ తో కూర్చుని మాట్లాడి మరీ ఈ సీక్వెన్స్ లు చేశాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పడం నిజంగా బావుంది.

నిర్మాత ఏఎమ్ రత్నం తనకు లగ్జరీ లైఫ్ ఇచ్చినవాడు అన్నాడు. తన ఖుషీగా గురించి ప్రస్తావించాడు. ఏఎమ్ రత్నం రీజినల్ సినిమాను నేషనల్ లెవల్ కు తీసుకువెళ్లాడని.. ఒకప్పుడు ఆయన చుట్టూ.. డిస్ట్రిబ్యూటర్లు తిరిగారని.. అలాంటి నిర్మాత నలిగిపోతుండటం బాధ కలిగించిందని చెప్పాడు. సాయత్రం రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుని ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం చెబుతూ.. అజ్ఞాతవాసి సినిమాలోని త్రివిక్రమ్ డైలాగ్ ను ఉటంకించాడు. ఏదేమైనా ఈ ప్రెస్ మీట్ ఏఎమ్ రత్నంకు కొండంత బలాన్నిచ్చింది. అదే సమయంలో ఏఎమ్ రత్నంను ఏపి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా ప్రతిపాదిస్తున్నాను అని చెప్పడం చూస్తే ఆ మధ్య వచ్చిన వార్తలు.. ఈ కారణంగా సినిమాను ఆపేయాలని కొందరు చేసిన ప్రయత్నాలు నిజమే అనిపించక మానదు. మొత్తంగా ఈ ప్రెస్ మీట్ తో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇంకా ఏం చెబుతాడా అని ఎదురుచూసేలా చేశాడు.

Tags

Next Story