Chiranjeevi and Pawan Kalyan : అన్నయ్య రికార్డ్‌పై తమ్ముడు రియాక్షన్

Chiranjeevi and Pawan Kalyan : అన్నయ్య రికార్డ్‌పై తమ్ముడు రియాక్షన్
X

మెగాస్టార్ చిరంజీవి పేరు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కడంపై తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రియాక్షన్ వైరల్ అవుతంది. అన్నయ్య చిరంజీవికి సినీ ప్రపంచంలో రికార్డులు, విజయాలు కొత్త కాదన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో లిఖితం కావడం ఎంతో ప్రత్యేకమన్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్స్‌తో అలరించిన నటుడిగా చిరంజీవి పేరు నమోదు కావడం ఎనలేని సంతోషాన్ని కలిగించిందని చెప్పారు.

ద మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ సినిమా అని గౌరవించడం ప్రతి ఒక్కరికీ ఆనందాన్నిస్తుందని చెప్పారు. అన్నయ్య చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నానని సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.

Tags

Next Story