Pawan Kalyan : ప్రకాష్ రాజ్ తో ఫైట్ కు సిద్ధమైన పవన్ కళ్యాణ్

Pawan Kalyan :  ప్రకాష్ రాజ్ తో ఫైట్ కు సిద్ధమైన పవన్ కళ్యాణ్
X

తిరుపతి లడ్డూ నాణ్యతతో మొదలైన రాజకీయ పంచాయితీలోకి నటుడు ప్రకాష్ రాజ్ ఎంటర్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఎక్స్ వేదికగా కొన్ని కమెంట్స్ చేశాడు. అది తర్వాత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం, ప్రకాష్ రాజ్ సమానత్వం పంచాయితీగా మారింది. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఇక ఎప్పట్లానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రకాష్ రాజ్ ను బండ బూతులు తిడుతూ సోషల్ మీడియాలో ఆడేసుకున్నారు. అతన్ని ఫేక సెక్యులరిస్ట్ అని చెబుతూ విమర్శలు చేశారు. ఇలాంటి టైమ్ లో పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ తో డైరెక్ట్ గా తలపడితే ఎలా ఉంటుందో ఊహించండి..? యస్.. అదే జరగబోతోంది.

పవన్, ప్రకాష్ ముఖాముఖి రాజకీయ వేదికగా కాదు. సినిమా కోసం. సుజిత్ డైరెక్ట్ చేస్తోన్న ‘ఓ.జి’లో ప్రకాష్ రాజ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే ఓజి షూటింగ్ మళ్లీ స్టార్ట్ కాబోతోంది. స్టార్టింగ్ లోనే పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించబోతున్నారట. ఆఫ్ స్క్రీన్ లో అగ్రెసివ్ గా ఉన్న ఈ ఇద్దరు ఆన్ స్క్రీన్ లోనూ అలాగే తలపడబోతున్నారు. సినిమా కాబట్టి పర్సనల్స్ ఏం ఉండవు. బట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య పర్సనల్ గా వాగ్వివాదం జరగకపోయినా.. ఆ అంశం గురించి చర్చలు మాత్రం సాగుతాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రకాష్ రాజ్ కు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతం ఇష్టమే. కానీ అతని పొలిటికల్ ఎజెండాపైనే వ్యతిరేకత. పవన్ కూడా వకీల్ సాబ్ టైమ్ లో ప్రకాష్ రాజ్ లాంటి నటుడు తోడైతే.. తనలో బెస్ట్ యాక్టర్ బయటకు వస్తాడు అని కితాబు ఇచ్చాడు. మొత్తంగా ఓజిలో ఈ యాక్షన్ సీన్ ఎలా ఉంటుందో కానీ.. ఇప్పుడీ మేటర్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

Tags

Next Story