Pawan Kalyan : 'వినోదయ సీతమ్' రీమేక్.. రోజుకు ముచ్చటగా మూడు కోట్లు

Pawan kalyan : వకీల్‌సాబ్ మూవీతో టాలీవుడ్‌కు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత భీమ్లానాయక్ మూవీతో అదరగొట్టాడు. రానా కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న పవన్.. ఈ సినిమాకి రూ. 50కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా ఫిలింనగర్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి.
అయితే ఈ రెండు సినిమాలు రీమేక్‌లే కావడం విశేషం.. ఇప్పుడు మరో రీమేక్‌ని లైన్‌లో పెట్టారు పవన్.. తమిళ్‌లో సూపర్ హిట్ అయిన వినోదయ సీతమ్‌ని పవన్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు పవన్..
వినోదయ సీతమ్ డైరెక్టర్ సముద్రఖని ఈ మూవీని తెలుగులో డైరెక్ట్ చేయనున్నాడని టాక్.. త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి పవన్ కేవలం 20 రోజులు మాత్రమే డేట్స్ కేటాయించారని, రెమ్యునరేషన్ ఏకంగా 60 కోట్లు తీసుకుంటున్నారట.. అంటే రోజుకు మూడుకోట్లు అన్నమాట.-
ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తీసుకున్న అత్యధిక రెమ్యూనరేషన్ ఇదే కావడం విశేషం. వినోదయ సీతమ్ రీమేక్‌లో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించనున్నారట.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ZEE5తో కలిసి ఈ సినిమాని నిర్మించనుందని తెలుస్తోంది.
ఈ సినిమా షూటింగ్ ఈ నెల 24న హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com